
మాస్ మహారాజ రవితేజ ‘మాస్ జాతర’ సినిమా విడుదల ఆలస్యానికి గల కారణాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. ఆయనకు వరుసగా జరిగిన గాయాలు, సర్జరీలే ఈ జాప్యానికి కారణమని రవితేజ స్వయంగా తెలిపారు. షూటింగ్ సమయంలో పడిన ఇబ్బందులు, విశ్రాంతి వివరాలు ఇక్కడ.
Key Points
రవితేజ 75వ సినిమా 'మాస్ జాతర' విడుదల పలుమార్లు వాయిదా పడింది.
సినిమా ఆలస్యానికి రవితేజకు అయిన వరుస గాయాలే ప్రధాన కారణమని వెల్లడైంది.
సాంగ్ షూటింగ్లో భుజానికి, ఫైట్ సీక్వెన్స్‌లో కాలుకు గాయాలై సర్జరీ జరిగింది.
గాయాల కారణంగా రవితేజ కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చి షూటింగ్ ఆలస్యమైంది.
రవితేజకు వరుస గాయాలు: అసలేం జరిగింది?
Raviteja : మాస్ మహారాజ రవితేజ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే రవితేజ 75 వ సినిమా మాస్ జాతర మాత్రం పలు మార్లు వాయిదా పడింది. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన సినిమా అక్టోబర్ 31 న రాబోతుంది. ఈ సినిమా ఆలస్యమవడానికి ముఖ్య కారణం రవితేజకు గాయాలు అవ్వడమేనట.(Raviteja)
గతంలో రవితేజకి మాస్ జాతర షూటింగ్ లో యాక్సిడెంట్ అయింది, సర్జరీ జరిగింది అని వార్తలు వచ్చాయి. అయితే అదొక్కటే కాకుండా ఇంకో గాయం కూడా అయిందట. తాజాగా మాస్ జాతర రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో సినిమా ఎందుకు ఆలస్యం అయిందో చెప్పుకొచ్చాడు రవితేజ.
‘మాస్ జాతర’ వాయిదాకు అసలు కారణం ఇదేనా?
Also See : Manchu Manoj : భార్యతో కలిసి అస్సాం కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన మంచు మనోజ్.. ఫొటోలు..
రవితేజకి మొదట సాంగ్ షూటింగ్ సమయంలో భుజానికి ఇంజ్యూరీ అయి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఫైట్ సీక్వెన్స్ లో కాలు ఇంజ్యూరీ అయిందని ఇన్ని ఇంజ్యూరీలు నాకు ఎప్పుడూ అవ్వలేదు అని తెలిపాడు. దీంతో మాస్ జాతర షూటింగ్ సమయంలో రవితేజ గాయాలతో బాగానే ఇబ్బంది పడ్డాడని, దాని వాళ్ళ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని అందుకే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయి విడుదలకు లేట్ అయిందని తెలుస్తుంది.
షూటింగ్ సమయంలో రవితేజ పడిన కష్టాలు
రవితేజ ఆరోగ్య సమస్యలు ‘మాస్ జాతర’ విడుదల ఆలస్యానికి దారి తీశాయి. అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ పూర్తి ఆరోగ్యంతో తదుపరి చిత్రాల్లో నటిస్తారని ఆశిద్దాం.


