|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రవితేజ లైఫ్‌లో పవన్ కళ్యాణ్.. ఏకంగా 5 బ్లాక్ బస్టర్స్ వెనుక అసలు కథ ఇదే!

Published: 08-02-2026, 9:05 AM
షాకింగ్: రవితేజ లైఫ్‌లో పవన్ కళ్యాణ్.. ఏకంగా 5 బ్లాక్ బస్టర్స్ వెనుక అసలు కథ ఇదే!
  • పవన్ కళ్యాణ్ వదులుకున్న ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ మూవీతో రవితేజకు హీరోగా గుర్తింపు!
  • ‘ఇడియట్’ మూవీ మొదట పవన్ కళ్యాణ్ కి చెప్పినా, రవితేజతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు పూరీ జగన్నాథ్.
  • రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ కూడా పవన్ రిజెక్ట్ చేసిందే.
  • పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు రవితేజకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి.

మాస్ మహారాజా రవితేజ కెరీర్లో ఊహించని ట్విస్ట్! పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలే రవితేజకు బ్లాక్ బస్టర్స్ అయ్యాయంటే నమ్ముతారా? అసలు ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం రండి!

పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవి?

మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల సక్సెస్‌ లు లేక స్ట్రగుల్‌ అవుతున్నాడు. మాస్‌ సినిమాలు చేసినా, యాక్షన్‌ సినిమాలు చేసినా, థ్రిల్లర్స్ చేసినా, చివరికి ఫ్యామిలీ స్టోరీస్‌ చేసినా సక్సెస్‌ రావడం లేదు. ఈ సంక్రాంతికి ఆయన `భర్తమహాశయులకు విజ్ఞప్తి` అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఫ్యామిలీ కథ అయినా, ఫన్‌ ఉన్నా కూడా ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో మరో ఫ్లాప్‌ తప్పలేదు. అయితే ఒకప్పుడు మాత్రం రవితేజ కెరీర్‌ పీక్‌లో ఉండేది. వరుస బ్లాక్‌ బస్టర్స్ తో స్టార్‌ హీరోగా రాణించారు.

ఇండస్ట్రీలో సాధారణంగా ఒకరికి అనుకున్న కథ మరొకరి వద్దకు వెళ్లడం కామనే. ఒక హీరోకి నచ్చకపోతే మరో హీరోకి కథ చెబుతారు దర్శకులు. ఇలా ఎవరో ఒకరు ఓకే చెప్పడంతో అది పట్టాలెక్కుతుంది. అయితే రవితేజ విజయాలు అందుకున్న వాటిలో ఎక్కువగా ఒకే హీరో రిజెక్ట్ చేయడం వల్ల వచ్చాయి. ఓ స్టార్‌ హీరో రిజెక్ట్ చేసిన ఐదు సినిమాలు తాను చేసి బ్లాక్‌ బస్టర్స్ అందుకున్నారు మాస్‌ మహారాజా. అందులో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి.  అలా రవితేజకి పరోక్షంగా లైఫ్‌ ఇచ్చిన స్టార్‌ హీరో ఎవరనేది చూస్తే,

మాస్‌ మహారాజా రవితేజకి లైఫ్‌ ఇచ్చిన హీరో ఎవరో కాదు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. ప్రస్తుతం ఆయన ఆంధ్ర ప్రదేశ్‌కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ రిజెక్ట్ చేసిన సినిమాలతోనే రవితేజ హిట్స్ అందుకున్నారు. తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. అలా పవన్‌ వదులకున్న చిత్రాల్లో `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` మొదటగా చెప్పొచ్చు. ఈ మూవీని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మొదట పవన్‌కే చెప్పారు. ఆయన నో చెప్పడంతో రవితేజ వద్దకు వెళ్లింది. అప్పటి వరకు హీరోగా నిలబడేందుకు స్ట్రగుల్‌ అవుతున్న రవితేజకి ఈ మూవీ హిట్‌ ఇచ్చి హీరోగా నిలబెట్టింది.

రవితేజ కెరీర్ టర్నింగ్ పాయింట్ మూవీస్

ఆ తర్వాత పవన్‌ వదులుకున్న సినిమాలో `ఇడియట్‌` కూడా ఉంది. ఈ చిత్ర కథని కూడా పూరీ జగన్నాథ్‌ మొదట పవన్‌కే చెప్పారు. కానీ ఆయన చేయలేదు. చాలా ప్రయత్నించినా వర్కౌట్‌ కాలేదు, దీంతో రవితేజ వద్దకు వెళ్లింది. మాస్‌ మహారాజా సినిమా చేశాడు, బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఆ టైమ్‌లో ఇది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. రవితేజకి బిగ్గెస్ట్ బ్రేక్‌ ఇచ్చింది. సూపర్‌ స్టార్‌ని చేసింది. లవ్‌ స్టోరీస్‌లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది.

రవితేజ, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మరో మూవీ `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి`. ఆసిన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బాక్సింగ్‌ నేపథ్యంలో సాగుతుంది. లవ్‌ స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది. దీంతో ఇది బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ కథని కూడా దర్శకుడు పూరీ మొదట పవన్‌ కళ్యాణ్‌ కే చెప్పాడట. కానీ ఆయన చేయలేదు. బిజీగా ఉండటం వల్ల నో చెప్పాడట. దీంతో రవితేజ వద్దకు వెళ్లింది. ఆయన చేశాడు, హిట్‌ కొట్టాడు.

పూరీ జగన్నాథ్, రవితేజ కాంబినేషన్ హిట్ సీక్రెట్

రవితేజ కెరీర్‌ని పీక్‌లోకి తీసుకెళ్లిన మూవీ `విక్రమార్కుడు`. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఆ టైమ్‌లో ఇది కూడా ఇండస్ట్రీ హిట్‌గా చెప్పొచ్చు. ఈ మూవీని పవన్‌ కళ్యాణ్‌ తో చేయలనుకున్నారట రాజమౌళి. ఆయన్ని కలిశాడట. కానీ కాంబినేషన్‌ వర్కౌట్‌ కాలేదు. ఆ టైమ్‌లో వేరే చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల నో చెప్పారట. అలా రవితేజకి మూవీ వచ్చింది. వచ్చిన ఛాన్స్ ని కరెక్ట్ గా వాడుకున్నాడు, బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు. తిరుగులేని సూపర్‌ స్టార్‌ గా ఎదిగాడు రవితేజ.

రవితేజ, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ `మిరపకాయ్‌`. ఈ సినిమా స్టోరీని ముందు పవన్ కే చెప్పాడు హరీష్‌ శంకర్‌.  ఆయన నో చెప్పాడు. దీంతో రవితేజతో చేశారు. ఇది డీసెంట్‌గానే ఆడింది. ఇలా పవన్‌ వదిలేసుకున్న చిత్రాలతో బ్లాక్‌ బస్టర్స్ అందుకుని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు రవితేజ. పరోక్షంగా రవితేజ స్టార్‌ కావడంలో పవన్‌ కళ్యాణ్‌ పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు.

పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు రవితేజకు ఎలా కలిసొచ్చాయో చూశారుగా. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.