|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ కొత్త మూవీ సంక్రాంతికి రిలీజ్.. గ్లింప్స్ చూశారా?

Published: 10-11-2025, 10:09 AM
రవితేజ కొత్త మూవీ సంక్రాంతికి రిలీజ్.. గ్లింప్స్ చూశారా?

మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ చెప్పిన ఫన్నీ డైలాగ్స్ గ్లింప్స్‌కు హైలైట్. ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడని అంచనాలున్నాయి.

Key Points

1

రవితేజ కొత్త చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సంక్రాంతికి విడుదల కానుంది.

2

కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

4

ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి ఈ చిత్రంలో హీరోయిన్లు.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథాంశం & తారాగణం

గత కొన్నేళ్లుగా హీరో రవితేజ సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ అనేది లేకుండా పోయింది. వారం పదిరోజుల క్రితం ‘మాస్ జాతర’ అంటూ వచ్చాడు. యధావిధిగా ఇది కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మరో కొత్త మూవీని సిద్ధం చేశాడు. దీనికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

గ్లింప్స్‌లో రవితేజ మార్క్ కామెడీ

నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న కిశోర్ తిరుమల.. రవితేజ కొత్త చిత్రానికి దర్శకుడు. గ్లింప్స్ చూస్తుంటే కామెడీగా బాగానే ఉంది. రామసత్యనారాయణ (రవితేజ)ని అతడి జీవితంలోని ఇద్దరు ఆడోళ్లు రెండు ప్రశ్నలు అడుగుతారు. ఇంతకీ ఆ ప్రశ్నలేంటి? వాటికి ఎవరూ ఎందుకు సమాధానం చెప్పలేకపోయారనేదే స్టోరీలా అనిపిస్తుంది.

‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు.. సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ.. ఇలా అన్నింటినీ అడిగారు. బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో’ అని రవితేజ చెప్పిన డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. ఇందులో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లు. భీమ్స్ సంగీతమందించాడు. వచ్చే సంక్రాంతికి మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్లింప్స్ చూస్తుంటే ఈసారి రవితేజ హిట్ కొడతాడేమో అనిపిస్తుంది.

సంక్రాంతి బరిలో మాస్ మహారాజా

గత చిత్రాల పరాజయాల తర్వాత రవితేజకు ఈ సినిమా విజయం కీలకం కానుంది. గ్లింప్స్ చూస్తుంటే కామెడీ పంచుతున్న ఈ చిత్రం సంక్రాంతికి మంచి హిట్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.