
📌 Key Points
- జనవరి 13న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ గ్రాండ్ రిలీజ్, సంక్రాంతికి సిద్ధం!
- కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ కామెడీ ధమాకా, మాస్ మహారాజ్ కొత్త అవతార్.
- డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా సందడి, గ్లామర్‌తో అలరించబోతున్నారు.
- జనరేటర్ లో షుగర్ వివాదం, ఫ్లాప్స్ పై సెటైర్లు ట్రైలర్ హైలైట్స్, ఫుల్ ఫన్ గ్యారెంటీ.
మాస్ మహారాజ్ రవితేజ నుంచి చాలా కాలం తర్వాత రాబోతున్న కామెడీ ధమాకా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. తాజాగా విడుదలైన ట్రైలర్ నవ్వుల సునామీ సృష్టిస్తోంది. సంక్రాంతి పండగను రెట్టింపు చేసేందుకు ఈ చిత్రం సిద్ధంగా ఉంది.
రవితేజ కామెడీ టచ్‌తో నవ్వుల సునామీ షాక్!
మాస్ మహారాజ రవితేజ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే చిత్రంతో వస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
చాలా కాలం తర్వాత రవితేజ నటిస్తున్న ఫన్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటి వరకు రవితేజ వరుసగా మాస్ సినిమాలు చేశారు. కానీ అన్నీ డిజాస్టర్ అవుతూ వచ్చాయి. ఈ చిత్రంలో ప్రేయసి, భార్య మధ్య నలిగిపోయే వ్యక్తిగా నటిస్తున్నాడు. ట్రైలర్ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీతో సాగుతుంది. ట్రైలర్ ప్రారంభంలో రవితేజ తన ఫ్లాప్ సినిమాలపై సెటైర్లు వేసుకున్నారు.
జనరేటర్‌లో షుగర్ వివాదం… సినిమాలో హైలైట్ పాయింట్!
ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్నులు, కత్తులు, భోజనాల ఫైట్, జాతర ఫైట్ ఇలా తెగ చేసేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పారు అంటూ రవితేజ తనపై తానే సెటైర్లు వేసుకున్నారు. ట్రైలర్ లో రవితేజ హీరోయిన్లతో పడే అవస్థలు, కమెడియన్ సత్య చేసే హంగామా నవ్వులు పూయించేలా ఉంది.
కొన్ని సన్నివేశాలు కొందరు వ్యక్తుల పై సెటైర్లు వేసినట్లు ఉంటాయి. తన భర్త శ్రీరామ చంద్రుడు అనుకునే హీరోయిన్ డింపుల్ హయతి.. ప్రేమించడానికి, రిలేషన్ షిప్ కి సరైన వ్యక్తి ఇతడే అని భావించే ఆషిక.. వీరి మధ్య కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కథగా కనిపిస్తోంది.
సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిద్ధం… పండక్కి పర్ఫెక్ట్!
ట్రైలర్ లో కొన్ని కాంట్రవర్షియల్ అంశాలని కూడా టచ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఒక సెలెబ్రిటీ ఫ్యామిలీ జనరేటర్ లో షుగర్ పోసిన వివాదం బాగా హైలైట్ అయింది. దానిని ఈ మూవీలో వాడుకున్నట్లు అనిపిస్తోంది. భీమ్స్ అందించిన బీజియం సినిమా టోన్ కి తగ్గట్లుగా ఉంది. ఆషిక రంగనాథ్ బాగానే గ్లామర్ ఒలకబోసినట్లు ఉంది. కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్, సునీల్ సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ అయినట్లు ఉన్నాయి. మొత్తంగా మాస్ మాహారాజ్ మాస్ ని పక్కన పెట్టి చాలా కాలం తర్వాత కామెడీతో అలరించబోతున్నారు. ఈ ట్రైలర్ పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించేలా ఉంది.
కామెడీ, యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని ఆశిద్దాం. ఈ పండగకు మాస్ మహారాజ్ నవ్వుల పంచడానికి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!


