|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: సింగర్ కార్తీక్ హీరోగా ఎంట్రీ! రాయవలస మూవీతో టాలీవుడ్‌లో దుమ్మురేపేందుకు రెడీ!

Published: 04-04-2026, 11:35 PM
షాకింగ్: సింగర్ కార్తీక్ హీరోగా ఎంట్రీ! రాయవలస మూవీతో టాలీవుడ్‌లో దుమ్మురేపేందుకు రెడీ!
  • సింగర్, రైటర్, డ్యాన్సర్ కార్తీక్ హీరోగా పరిచయం! రాయవలస మూవీతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించనున్నాడు.
  • ఎన్నారై మహిళా రాధిక దర్శకత్వంలో రాయవలస మూవీ రూపోందింది! ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి కావడం విశేషం.
  • ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పెంచేసిన రాయవలస! కార్తీక్ ఇంటెన్స్ లుక్‌కు ఫిదా అవుతున్న ప్రేక్షకులు.
  • శ్రీషా నూలు హీరోయిన్‌గా నటిస్తున్న రాయవలస! గ్రామీణ నేపథ్యంలో చిత్రం తెరకెక్కుతోంది, త్వరలో విడుదల కానుంది.

టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే న్యూస్! సింగర్, రైటర్, డ్యాన్సర్ కార్తీక్ జయంతి హీరోగా పరిచయం అవుతున్నారు. ఎన్నారై మహిళా రాధిక దర్శకత్వంలో రాయవలస అనే సినిమాతో వస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

హీరోగా మారిన సింగర్ కార్తీక్ జయంతి!

Rayavalasa Movie First Look Released: రాయసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో తెరకెక్కుతున్న రాయవలస సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఎన్ఆర్ఐ మహిళ దర్శకురాలిగా పరిచయం అవుతున్న రాయవల సినిమాలో నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. మరిన్ని విశేషాల్లోకి వెళితే!

రాయసన్ ప్రొడక్షన్స్ తమ తొలి చిత్రమైన “ రాయవలస ” ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఊరి జీవితం, నిజ సంఘటనల ఆధారంగా మనసును తాకే కథతో వస్తున్న ఈ చిత్రం తెలుగు సినీ రంగంలో ఓ తొలి ప్రయత్నంగా నిలుస్తోంది. గోపీ కృష్ణ జె నిర్మించిన ఈ సినిమా, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆయన విజన్‌కు నిదర్శనం.

దర్శకురాలిగా ఎన్ఆర్ఐ రాధిక జయంతి!

ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి కావడం, ఆమె టీమ్ కృషి, నిబద్ధతకు ఉదాహరణ. అవార్డు విజేత దర్శకురాలిగా రాధిక, గ్లోబల్ టచ్‌తో నేటివిటీని మిళితం చేసి కథను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. డీఓపీ కిట్టు అద్భుత విజువల్స్ అందించగా, రాఖీ నిజజీవిత సంఘటనల ఆధారంగా, గ్రామీణ నేపథ్యంతో శక్తివంతమైన కథను రూపొందించారు

“Love Tied by Fate” అనే సినిమా ట్యాగ్‌లైన్ కథలోని భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబించనున్నట్లు చూపిస్తుంది. టైటిల్ డిజైన్ ప్రత్యేకతతో ఆకట్టుకుంటుంది. హీరో, టైటిల్‌ను విద్యార్థుల మధ్య ఒక కాలేజీలో గ్రాండ్‌గా లాంచ్ చేయడం, డెబ్యూ హీరో కార్తిక్ జయంతి పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌తో ప్రజలు, సినీ ప్రముఖుల దృష్టిని వెంటనే ఆకర్షించింది.

ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాయవలస మూవీ!

హీరోయిన్ శ్రీషా నూలు ఇతర ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి, ఈ సినిమాలో కార్తిక్ జయంతితో జోడీగా కనిపిస్తూ అలరించబోతున్నారు. ఆమె కథలో ఒక ముఖ్యమైన, గుర్తుండిపోయే పాత్రను పోషించారు అలాగే, రాయవలస సినిమాలో అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ నటులు, త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు వంటి ప్రతిభావంతులు కూడా చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తారు.

రాయవలస ఫస్ట్ లుక్‌తోనే మంచి అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం దర్శకురాలు రాధిక జయంతి, హీరో కార్తిక్ జయంతి ఇద్దరినీ తెలుగు సినీ రంగంలో ప్రామెసింగ్ ట్యాలెంట్‌గా నిలబెట్టనుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

రాయవలస మూవీ ఫస్ట్ లుక్‌తోనే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కార్తీక్, రాధిక ఇద్దరూ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.