
📌 Key Points
- రేణు దేశాయ్ ప్రెస్ మీట్‌లో వీధి కుక్కల సమస్యపై ఆవేదన, రష్మీ గౌతమ్‌తో కలిసి నిర్వహణ!
- పిల్లల గురించి అసభ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదు, వార్నింగ్ ఇచ్చిన రేణు దేశాయ్!
- పవన్ కళ్యాణ్ పేరు లాగితే సహించేది లేదు, రేణు ఫైర్! వీడియో వైరల్.
- రాజకీయాల్లోకి రావడం లేదు, కేవలం మూగజీవాల కోసమే: రేణు దేశాయ్
షాకింగ్ న్యూస్! రేణు దేశాయ్ ఒక్కసారిగా మీడియాపై ఫైర్ అయ్యారు. వీధి కుక్కల సమస్యపై మాట్లాడుతూ ఎమోషనల్ అయిన రేణు, పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసలేం జరిగిందో తెలుసా?
వీధి కుక్కల సమస్యపై రేణు ఆగ్రహం
నటి రేణు దేశాయ్ ఉగ్రరూపం చూపించింది. వీధి కుక్కల సమస్యపై రష్మి గౌతమ్ తో కలిసి ఆమె నిర్వహించిన ప్రెస్ మీట్ లో గందరగోళం నెలకొంది. ఇందులో తాను సీరియస్ కావడంతో పవన్ కల్యాణ్ ను, తన పిల్లలను లాగుతూ ట్రోలింగ్ చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం (జనవరి 19) వీధి కుక్కల సమస్యపై నటి రేణు దేశాయ్ (Renu Desai), యాంకర్ రష్మీ గౌతమ్, దర్శకుడు శశి కిరణ్ తిక్కా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం కాస్తా ఉద్రిక్తతకు దారితీసింది. చర్చ మధ్యలో రేణు దేశాయ్ సహనం కోల్పోయి అరవడం, ఆ వీడియోలు వైరల్ కావడం చర్చనీయాంశమైంది. దీనిపై రేణు దేశాయ్ స్వయంగా స్పందిస్తూ ఒక క్లారిఫికేషన్ వీడియో విడుదల చేసింది.
పవన్ కళ్యాణ్ పేరు లాగితే ఫైర్
మగాళ్లు తప్పు చేస్తే అందరినీ చంపేస్తామా?
ఆ వ్యక్తి కొట్టడానికి వచ్చాడు.. అందుకే అరిచా!
పిల్లల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు
పవన్ కళ్యాణ్ ప్రస్తావన, పిల్లలపై శాపనార్థాలు..
అంతకంటే దారుణంగా.. “నీ పిల్లలు (అకీరా, ఆద్య) కుక్క కాటు వల్ల చస్తే అప్పుడు నీకు బుద్ధి వస్తుంది” అని కొందరు శపించడం తనను కలిచివేసిందని రేణు కన్నీటిపర్యంతమయింది. “ఒక తల్లిగా ఆ మాటలు నన్నెంత బాధిస్తాయో మీకు తెలుసా? నేను రాజకీయాల్లోకి రావడం లేదు, డబ్బు కోసం చేయడం లేదు.. కేవలం తోటి ప్రాణుల కోసం మాట్లాడుతున్నా. నా పిల్లల చావు కోరుకుంటూ కామెంట్స్ చేయకండి” అని ఆమె విజ్ఞప్తి చేసింది.
రేణు దేశాయ్ ఆవేదనతో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


