|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రేణు దేశాయ్ ఫైర్: మనుషులు తప్పు చేస్తే అందరినీ చంపేస్తారా? వీధి కుక్కల విషయంలో షాకింగ్ కామెంట్స్!

Published: 19-01-2026, 5:00 AM
రేణు దేశాయ్ ఫైర్: మనుషులు తప్పు చేస్తే అందరినీ చంపేస్తారా? వీధి కుక్కల విషయంలో షాకింగ్ కామెంట్స్!
  • వీధి కుక్కల దాడులపై రేణూ దేశాయ్ ఆవేదన, వాటిని చంపడంపై ఆగ్రహం.
  • కుక్కలను చంపే బదులు సమస్యకు పరిష్కారం కనుగొనాలని రేణు దేశాయ్ సూచన.
  • అర్ధరాత్రి వేళల్లో కుక్కలు తన చుట్టూ తిరిగినా కరవలేదని రేణు దేశాయ్ వెల్లడి.
  • ప్రస్తుత ప్రభుత్వాలు దోమల నివారణకు ఏమి చేశాయని ప్రశ్నించిన రేణు దేశాయ్.

జంతు ప్రేమికురాలు రేణూ దేశాయ్ వీధి కుక్కల దాడులపై స్పందించారు. కుక్కలను చంపడం పరిష్కారం కాదని, ఈ సమస్యకు వేరే మార్గం చూడాలని ఆమె అన్నారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వీధి కుక్కలపై రేణూ దేశాయ్ ఆవేదన

Renu Desai:జంతు ప్రేమికురాలిగా పేరు దక్కించుకున్న రేణూదేశాయ్ (Renudesai )గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా వీధి కుక్కల విషయంలో తన గొంతును విప్పుతూ వాటి సంరక్షణలో తన వంతు ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా మూగ జంతువుల కోసం ఎన్జీవో నిర్వహిస్తున్న ఈమె.. తన సంపాదనలో కొంతభాగం ఈ ఎన్జీవో కి ఉపయోగిస్తూనే.. అవసరమైన డబ్బును అభిమానులను అడిగి మరీ తీసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న అంశం వీధి కుక్కల దాడులు.

ముఖ్యంగా ఈ వీధి కుక్కలు చిన్నపిల్లలను మొదలుకొని పెద్దలు , వృద్ధులపై కూడా గుంపుగా దాడులు చేస్తూ వారి మరణాలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీధి కుక్కల విషయంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఇకపోతే తాజాగా ఇప్పుడు వీధి కుక్కలపై జరుగుతున్న దాడుల గురించి స్పందిస్తూ.. ప్రముఖ నటి రేణు దేశాయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మరీ వీధి కుక్కలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ..” ఎక్కడో ఒక కుక్క కరిస్తే.. ఆ వీధిలోని కుక్కలన్నింటినీ చంపడం ఎంతవరకు కరెక్ట్ ? మగాళ్లు అత్యాచారాలు, హత్యలు చేస్తుంటారు.. అలాగని మగాళ్ళందర్నీ హంతకులు, రేపిస్టులని చంపేస్తామా? అసలు బుద్ధి ఉందా?” అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ముఖ్యంగా మూగజీవాల పట్ల క్రూరంగా ప్రవర్తించవద్దని, కొన్ని కుక్కల ప్రవర్తనకు జాతి మొత్తాన్ని బలి చేయడం సరికాదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రేణూ దేశాయ్.

మూగజీవాల పట్ల దయ చూపాలని విజ్ఞప్తి

ఇక అదే ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం నా వయసు 45 సంవత్సరాలు. నేను అర్ధరాత్రి 11, 12 గంటల సమయంలో వీధిలో వెళ్తుంటే.. నా చుట్టూ 10 – 15 కుక్కలు తిరుగుతూ ఉంటాయి. అయితే ఏ రోజు కూడా ఒక్క కుక్క కూడా నన్ను కరవలేదు. కానీ గత ఏడాది ఒక దోమ కారణంగా నేను డెంగ్యూ బారిన పడి.. దాదాపు చనిపోయే స్టేజ్ కి వెళ్ళిపోయాను. అప్పుడు మీ ప్రభుత్వాలు ఏం చేశాయి ? అంటూ ఘాటుగా ప్రశ్నించింది రేణు దేశాయ్. ఇక రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రభుత్వాల నిర్లక్ష్యంపై రేణు దేశాయ్ ప్రశ్నలు

రేణు దేశాయ్ విషయానికి వస్తే.. కాస్ట్యూమ్ డిజైనర్ గా తనకంటూ పేరు దక్కించుకున్న ఈమె.. హీరోయిన్గా పలు చిత్రాలు చేసింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డీసీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య కూడా.. నిజానికి పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేసి అఖీరా నందన్ కు జన్మనిచ్చిన తర్వాత అతడి సమక్షంలో వివాహం చేసుకుంది ఈ జంట. ఇక ఆధ్య పుట్టిన తర్వాత విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. భర్తకు దూరంగా ముంబైలో పిల్లల ఆలనా పాలన చూసుకుంటున్న రేణు దేశాయ్ మరొకవైపు పలు సోషల్ మీడియా అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది.

రేణూ దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంతువుల పట్ల ఆమెకున్న ప్రేమను, సమాజంలో బాధ్యతగా ఆమె వ్యవహరిస్తున్న తీరును చాలామంది మెచ్చుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.