
📌 Key Points
- రేణు దేశాయ్ ప్రెస్ మీట్‌లో సంచలనం: వ్యక్తిగత దూషణలు, దాడికి ప్రయత్నం జరిగాయని ఆరోపణ!
- మూగజీవాల కోసం పోరాడుతుంటే ట్రోల్స్ ఏమిటని రేణు ప్రశ్న: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై ఆవేదన!
- రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రేణు: ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని స్పష్టీకరణ!
- వీధి కుక్కల సమస్యపై రేణు ఆగ్రహం: వాటిని చంపడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీత!
ప్రముఖ నటి రేణు దేశాయ్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!
ప్రెస్ మీట్లో రేణు సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ నటి రేణు దేశాయ్ తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో ఆమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ముఖ్యంగా ఆమె అరుస్తూ వీడియోలో కనిపించడంతో రేణు దేశాయ్ ఎందుకలా అరుస్తోందంటూ చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆమె విలేకరులపై అరుస్తోందని ఎంతోమంది భావించారు. తన ఆగ్రహంపై తాను మాట్లాడిన మాటలపై క్లారిటీ ఇచ్చారు రేణూ దేశాయ్. తను ఏ ఉద్దేశంతో మాట్లాడిందో ఆ సందర్భంలో ఎందుకంత కోపంగా మాట్లాడాల్సి వచ్చిందో వివరించారు. ఒక చిన్న వీడియో క్లిప్ వల్ల అసలు విషయం పక్కదారి పట్టిందని, పూర్తి సందర్భం తెలియకుండా తనపై విమర్శలు చేస్తున్నారని ఆమె బాధపడుతూ చెప్పారు.
రేణూ దేశాయ్ చెబుతున్న ప్రకారం ఆరోజు పెట్టిన ప్రెస్ మీట్లో తాను మీడియాపై కోపంతో అరవలేదని వివరించారు. బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి తనను తిట్టాడని, మీదకొచ్చి కొట్టేలా ప్రవర్తించాడని దాంతో కోపంగా అరిచాను అని తెలిపింది. అంతే తప్ప మీడియా మీద తనకు ఎలాంటి ద్వేషము లేదని వివరించింది. ఎలాంటి లాభం చూసుకోకుండా ఎన్జీవో నడుపుతున్నానని, వీలైనంత సేవ చేస్తున్నానని ఆమె చెప్పింది. మూగజీవాల కోసం పోరాడుతూ ఉంటే ఇంతగా సోషల్ మీడియాలో వ్యక్తిగత ట్రోల్స్ చేయాలా? అని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని వదిలేయడానికి ఇదే కారణమని కామెంట్లు పెట్టడం, మరికొందరు కుక్కలు కరిచి మీ పిల్లలు చనిపోతే తెలుస్తుందని కామెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నించారు.
ట్రోల్స్ పై రేణు దేశాయ్ ఫైర్!
వీధి కుక్కలను ఇష్టానుసారం చంపేయడాన్ని ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ రచ్చ మొదలైంది. ఓ సందర్భంలో రేణు దేశాయ్ పూర్తిగా సహాయం కోల్పోయినట్టు కనిపించింది. మీడియా వారితో తగువుకు దిగినట్టు అనిపించింది. గట్టిగా అరుస్తూ కుక్కల కోసం ఆమె పోరాడుతూ కనిపించారు. దీంతో కొంతమంది మీడియా ప్రతినిధులు ఆమెపై నిరసన వ్యక్తం చేశారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆమె బాగా ట్రోల్ అయ్యారు.
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన రేణు!
ఈ రచ్చ తర్వాత రేణు దేశాయ్ రాజకీయాల్లోకి రాబోతోందని, అందుకే ఇంత గొడవ పెట్టుకుందని కామెంట్లు వినిపించాయి. దానిపై కూడా రేణు స్పందించారు. తను రాజకీయాల్లోకి వస్తున్నట్టు జరుగుతున్నది కేవలం ప్రచారమేమని తనకి ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పారు. తను ఏ పార్టీలో చేరనని అసలు రాజకీయాల మీద తనకు ఆసక్తి లేదని చెప్పేశారు. ఒకవేళ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే దాని గురించి అధికారికంగా ప్రకటన చేస్తానని ఆమె వివరించారు.
రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. దీనిపై మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.


