
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. సర్జరీ తర్వాత తన కూతురుతో దిగిన ఆ ఫోటో వైరల్‌గా మారింది. ఆమె ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Key Points
రేణు దేశాయ్ సర్జరీ తర్వాత ఫోటోను షేర్ చేశారు.
ఆమె కూతురు ఆధ్యతో కలిసి డిన్నర్‌కు వెళ్లారు.
ఫోటోలో ఆమె కాస్త డల్‌గా కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.
రేణు దేశాయ్ సర్జరీ
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది.
తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియా(social Media)లో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టా(Instagram)లో ఓ స్టోరీ పెట్టింది. అందులో తన కూతురు ఆధ్యతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘చివరికి సర్జరీ తర్వాత నా ముద్దుల పిల్లలతో డిన్నర్ కి బయటకు వెళ్ళాను’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఫొటోలో రేణు దేశాయ్ కాస్త డల్‌గా కనిపించింది. అలాగే సర్జరీ అనే సరికి ఆమె ఫ్యాన్స్ ఏమైందని ఆందోళన చెందుతున్నారు.
ఫోటో వైరల్
అభిమానుల ఆందోళన
రేణు దేశాయ్ యొక్క సర్జరీ విషయంపై అభిమానులు ఆందోళనతో ఉన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, ఆమె ఆరోగ్యం గురించి మరిన్ని వివరాల కోసం ఎదురు చూస్తున్నారు.


