
📌 Key Points
- రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీ టీజర్ వీడియో షేర్ చేసింది.
- టీజర్‌ను లూప్‌లో చూసి, సినిమా తొందరగా రిలీజ్ చేయమని ఆత్రుత వ్యక్తం చేసింది.
- అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో షానీల్ డియో దర్శకత్వంలో ‘డెకాయిట్’ రూపొందుతోంది.
- ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
రేణు దేశాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అడివి శేష్ డెకాయిట్ మూవీ టీజర్‌పై పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. టీజర్‌ను లూప్‌లో చూసిన ఆమె, సినిమా కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
బద్రీ(Bhadri), జానీ(Johny) వంటి సినిమాలో పవన్ కళ్యాణ్‌తో జంటగా నటించి రేణు దేశాయ్(Renu Desai) ప్రేమలో పడింది. అలా కొన్నాళ్లు ఇద్దరు డేటింగ్ చేసిన అనంతరం వారు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఒక పాప బాబు ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో డివోర్స్ తీసుకొని విడిపోయారు. ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ మరో పెళ్ళి చేసుకోకుండా తన పిల్లల బాధ్యతను చూసుకుంటుండగా.. పవన్ కళ్యాణ్ మాత్రం మరో పెళ్లిచేసుకున్నాడు. ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
‘డెకాయిట్’ మూవీ విశేషాలు
ఇక రేణు దేశాయ్ మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. అలా దాదాపు 20 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్స్ స్టార్ట్ చేశారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ప్రెజెంట్ బ్యాడ్ గర్ల్స్ మూవీలో కీరోల్ ప్లే చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రేణుతన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టింది. అందులో అడివి శేష్ డెకాయిట్ మూవీ టీజర్ వీడియోను షేర్ చేస్తూ.. ‘ష్.. ప్లీజ్ డెకాయిట్ మూవీను తొందరగా రిలీజ్ చేయండి.. నేను ఈ టీజర్‌ను లూప్‌లో చూశాను అని హార్ట్ సింబల్స్ జోడించింది.
రేణు దేశాయ్ రీ-ఎంట్రీ, సినీ ప్రస్థానం
దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. కాగా టాలీవుడ్ స్టార్ హీరో అడివి శేష్ (Adivi Sesh), యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘డెకాయిట్’ (Dacoit) మూవీకు షానీల్ డియో(Shanil Deo) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ(Supriya Yarlagadda) నిర్మిస్తుంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా, నటిగా రేణు దేశాయ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అడివి శేష్ ‘డెకాయిట్’ టీజర్‌పై ఆమె స్పందన సినిమాపై మరింత హైప్‌ను పెంచిందని చెప్పాలి. ఈ చిత్రం ఎలా అలరిస్తుందో చూడాలి.


