|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Renu Desai : రేణు దేశాయ్ కి సర్జరీ.. ఏం సర్జరీ జరిగింది?

Published: 11-07-2025, 7:04 AM
Renu Desai : రేణు దేశాయ్ కి సర్జరీ.. ఏం సర్జరీ జరిగింది?

సినిమా నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సర్జరీ చేయించుకున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు. ఆమె కూతురుతో కలిసి డిన్నర్ కు వెళ్ళిన ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ ఏ సర్జరీ అనేది మాత్రం చెప్పలేదు.

Key Points

1

రేణు దేశాయ్ సర్జరీ తర్వాత కూతురు ఆద్యతో కలిసి డిన్నర్ కు వెళ్ళింది.

2

సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది.

4

గతంలో గుండె సమస్యలతో బాధపడుతున్నట్లు రేణు తెలిపింది.

రేణు దేశాయ్ సర్జరీ వార్తలు

Renu Desai : పవన్ మాజీ భార్యగా, ఒకప్పటి హీరోయిన్ గా రేణు దేశాయ్ అందరికి పరిచయమే. సినిమాలకు దూరమయినా ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అప్డేట్ లో ఉంటుంది రేణు దేశాయ్. అయితే తాజాగా రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. మొత్తానికి నా సర్జరీ తర్వాత నా క్యూటీస్ తో కలిసి బయటకు డిన్నర్ కు వచ్చాను అని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో రేణు దేశాయ్ ఫేస్ కొంచెం కళ తప్పినట్టు కూడా ఉంది. దీంతో రేణు దేశాయ్ కి ఏం సర్జరీ జరిగింది? సర్జరీ జరిగింది అని పెట్టింది కానీ ఏం సర్జరీ అని చెప్పలేదు ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

సోషల్ మీడియాలో వైరల్

గతంలో రేణు దేశాయ్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపింది. మరి గుండెకు సంబంధించిన సర్జరీ ఏమైనా జరిగిందా? లేక ఇంకేదైనా సర్జరీ జరిగిందా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. దీనిపై రేణు దేశాయ్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

సర్జరీ వివరాలు తెలియక ప్రజల ఆందోళన

రేణు దేశాయ్ ఏ సర్జరీ చేయించుకుందో ఇంకా స్పష్టత లేదు. ఆమె త్వరలోనే ఈ విషయంపై స్పందిస్తుందని ఆశిద్దాం. ఆమె ఆరోగ్యం బాగుండాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.