
📌 Key Points
- పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కాశీలో మనశ్శాంతి కోసం అన్వేషణ!
- దేవాలయంలో రేణు దేశాయ్.. ఆధ్యాత్మిక చింతనలో లీనమైన ఫోటోలు వైరల్
- ‘మనశ్శాంతి ఒక స్వాభావిక గుణమా?’ అంటూ రేణు దేశాయ్ ఆసక్తికరమైన పోస్ట్
- టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. బ్యాడ్ గర్ల్స్‌లో కీలక పాత్ర!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె తన మనశ్శాంతి కోసం చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
కాశీలో రేణు దేశాయ్ ఆధ్యాత్మిక యాత్ర!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ రేణు దేశాయ్ మనందరికీ సుపరిచితమే. బద్రీ(Bhadri), జానీ(Johny) వంటి సినిమాలో పవన్ కళ్యాణ్‌తో జంటగా నటించి రేణు దేశాయ్(Renu Desai) పవన్ కళ్యాణ్ ప్రేమలో పడింది. అలా కొన్నాళ్లు ఇద్దరు డేటింగ్ చేసిన అనంతరం వారు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఒక పాప బాబు ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో డివోర్స్ తీసుకొని విడిపోయారు. ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ మరో పెళ్ళి చేసుకోకుండా తన పిల్లల బాధ్యతలను చూసుకుంటుండగా.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాత్రం మరో పెళ్లి చేసుకున్నాడు.
ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. అలా దాదాపు 20 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇక రీసెంట్‌గా బ్యాడ్ గర్ల్స్ మూవీలో ఓ కీల్ రోల్ ప్లే చేసింది. ఇదిలా ఉంటే.. ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులను పెంచుకుంటుంది.
మనశ్శాంతిపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం కాశీలో ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో దేవాలయంలో కూర్చుని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘మనశ్శాంతి అనేది ఒక స్వాభావిక గుణమా అని ఆలోచిస్తున్నాము మరియు భౌతిక అంచనాల వెనుక పరిగెడుతూ మనం దానిని కోల్పోయామా’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
సినిమాల్లోకి రేణు దేశాయ్ రీఎంట్రీ.. వివరాలివే!
A post shared by renu desai (@renuudesai)
రేణు దేశాయ్ గారి తాజా పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఆమె మనశ్శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


