
📌 Key Points
- రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్‌లో: వైరల్ వీడియో!
- అల్లు శిరీష్ వివాహ వేడుకలో సందడి చేసిన సీఎం, ఐకాన్ స్టార్.
- పుష్ప 2 రిలీజ్ సమయంలో వివాదం తర్వాత మొదటిసారి కలిసిన ఇద్దరు.
- రేవంత్, బన్నీ మధ్య సఖ్యత: రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్!
టాలీవుడ్ ప్రేక్షకులకి ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అల్లు శిరీష్ పెళ్లిలో రేవంత్, అర్జున్ సందడి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే వేదికపై మరోసారి మెరిశారు. అంతేకాదు పక్క పక్కనే కూర్చుని, సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ( Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ వివాహం తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. బంధు మిత్రులు, కుటుంబ సమక్షంలోనే అల్లు శిరీష్-నయనిక వివాహం జరిగింది.
ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. హైదరాబాద్ లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్ వేదికగా ఈ వివాహ వేడుక జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) కూడా ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త జంటకు పుష్పగుచ్చం ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత నూతన వధూవరులు, సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ తదితరులు కలిసి ఫోటో దిగారు.
పుష్ప 2 వివాదం తర్వాత తొలిసారిగా కలయిక
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ పక్క పక్కనే కూర్చొని షేక్ హ్యాండ్ ఇస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. కాగా పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన రోజు తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించింది. ఈ కేసులో అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పటి నుంచి వీళ్ళ మధ్య గ్యాప్ పెరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా ఈవెంట్ నేపథ్యంలో ఇద్దరు చాలా సరదాగా మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అయింది.
రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా వీడియో
A post shared by Media Mic Tollywood (@mediamictollywood)
రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ కలయిక టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరి మధ్య సఖ్యత కుదిరినట్లు తెలుస్తోంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.


