|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. షాకింగ్ ట్వీట్ చేసిన ఆర్జీవీ.. ఇక్కడ కూడానా అంటున్న నెటిజన్లు..

Published: 13-06-2025, 7:44 AM
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. షాకింగ్ ట్వీట్ చేసిన ఆర్జీవీ.. ఇక్కడ కూడానా అంటున్న నెటిజన్లు..

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేసి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాడు. ఆయన ట్వీట్‌కు నెటిజన్లు వివిధ రీతులలో స్పందించారు.

Key Points

1

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఆర్జీవీ ట్వీట్

2

దేశంలో జరిగిన ఇటీవలి దుర్ఘటనలను ఆర్జీవీ ప్రస్తావించడం

4

జీవితం అనిశ్చితమని నెటిజన్ల అభిప్రాయం

ఆర్జీవీ ట్వీట్ వైరల్

అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో 260 మందికిపైగా చనిపోయారు. కేవలం ఒక్కరే మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. మరణించిన వారికి సంబంధించిన ఒక్కొక్కరి కథలు వింటుంటే కన్నీరు వస్తుండగా… ఇప్పటికే ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో దర్శకుడు ఆర్జీవీ ఇందుకు సంబంధించి ట్వీట్ చేశాడు. ‘దేవుడికే తెలియాలి దేవుడు ఏం చేస్తున్నాడో’ అంటూ పోస్ట్ పెట్టాడు. అసలు జీవితం ఎక్కడ ముగుస్తుందో చెప్పలేకపోతున్నామని బాధపడ్డాడు.

‘వెకేషన్ కోసం బ్యూటిఫుల్ ప్లేస్‌కు వెళ్తే తీవ్రవాదులు చంపేస్తరు.. ట్రోఫీ గెలిచామని సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్తే తొక్కిసలాటలో చనిపోతం.. ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కితే క్రాష్ అయిపోయి జీవితం ముగుస్తుంది.. హాస్టల్‌లో అన్నం తింటుంటే నీపై ప్లేన్ కుప్పకూలి ప్రాణం పోతుంది’ అంటూ ఈ మధ్య దేశంలో జరిగిన దుర్ఘటనల గురించి ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయిపోయాడు. కాగా ఆర్జీవీ కూడా దేవుడి గురించి మాట్లాడుతున్నాడంటే ఈ విమాన ప్రమాదం ఎంత బాధ పెట్టిందో అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే.. నిజంగానే లైఫ్ అన్‌ప్రెడిక్టబుల్ అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. నువ్వు కూడా కాపీ కంటెంట్ పోస్ట్ చేస్తున్నావా అని ఇంకొందరు ఆర్జీవీని విమర్శించే పనిలో ఉన్నారు.

నెటిజన్ల స్పందనలు

అనిశ్చితమైన జీవితం

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఆర్జీవీ ట్వీట్ ద్వారా ప్రజల భావాలను ప్రతిబింబించారు. జీవితం అనిశ్చితమని ఈ ఘటన మరోసారి చాటుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.