
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తాజాగా ‘ఓ భామ అయ్యో రామ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని సినిమా పరిశ్రమలో నెపోటిజం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయాలను ఈ కథనం వివరిస్తుంది.
Key Points
మంచు మనోజ్ 'ఓ భామ అయ్యో రామ' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ కామెంట్స్
నెపోకిడ్స్ కు కేవలం ఎంట్రీకి మాత్రమే అవకాశాలు దక్కుతాయి అని అభిప్రాయం
సినిమా విజయానికి కష్టపడటం, ప్రేక్షకుల ఆదరణ ముఖ్యం అని మంచు మనోజ్ అభిప్రాయం
సుహాస్ విజయం మంచు మనోజ్ కు స్ఫూర్తిదాయకం
మంచు మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) చాలా రోజుల తర్వాత మల్టీ స్టారర్ ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ సాధించలేనప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మంచు మనోజ్ ‘ఓ భామ అయ్యో రామ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘‘సుహాస్ ప్రయాణం నాకెంతో స్ఫూర్తి. యూట్యూబ్ నుంచి మొదలుపెట్టి కమెడియన్‌గా మారి ఇప్పుడు హీరో స్థాయికి వచ్చాడు.
నెపోటిజంపై మంచు మనోజ్ అభిప్రాయాలు
ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకున్నాడు. నేటి తరం తనను చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఇండస్ట్రీలో నెపోకిడ్స్‌కే అవకాశాలు దక్కుతాయన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. అది కరెక్ట్ కాదు. సినీ నేపథ్యం ఉన్న వాళ్లకి కేవలం ఎంట్రీకి మాత్రమే అది పనికొస్తుంది. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. నెపోకిడ్ అయినంత మాత్రాన విజయాలు వరించవు. సినిమా కోసం కష్టపడాలి, దాన్ని ప్రేక్షకులు ఇష్టపడాలి అప్పుడే ఇక్కడ రాణించగలం. మల్టీస్టారర్లు, హై బడ్జెట్ వంటి అంశాలు సినిమా విజయాన్ని డిసైడ్ చేయలేవు.
‘ఓ భామ అయ్యో రామ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్
తమిళ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi)లా సుహాస్(Suhas) కూడా అటు క్యారెక్టర్ ఆర్టిస్టులా, ఇటు హీరోలా రెండు వైపులా రాణిస్తుండటం మెచ్చుకోదగ్గ విషయం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ కామెంట్స్ మంచు మనోజ్ విజయ్‌ని ఉద్దేశించి అన్నట్లు తెలుస్తోంది. గతంలో స్టార్ నెపోకిడ్ అయితే ఇండస్ట్రీలో రాణించగలం అనడంతో మంచు మనోజ్ అవన్నీ పప్పులేం ఉడకవని టాలెంట్‌తో ఆధారపడి ఉంటుందని అన్నారు. కాగా, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, మాళవిక మనోజ్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఓ భామ అయ్యో రామ’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ జూలై 11న థియేటర్స్‌లోకి రాబోతుంది.
చివరగా, మంచు మనోజ్ వ్యాఖ్యలు టాలీవుడ్ లో నెపోటిజంపై చర్చను రేకెత్తించాయి. టాలెంట్, కష్టపడటం ద్వారానే విజయం సాధించగలమని ఆయన అభిప్రాయం.


