|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నప్పపై ‘ఆర్జీవీ’ ట్వీట్‌.. మంచు విష్ణు రియాక్షన్‌

Published: 28-06-2025, 8:50 AM
కన్నప్పపై 'ఆర్జీవీ' ట్వీట్‌.. మంచు విష్ణు రియాక్షన్‌

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఆర్జీవీ తన అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేయగా, విష్ణు దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Key Points

1

కన్నప్ప సినిమాపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు.

2

మంచు విష్ణు నటనను ఆర్జీవీ మెచ్చుకున్నారు.

4

సినిమాపై వచ్చిన విమర్శలను ఎదుర్కొని విజయం సాధించిన విషయాన్ని విష్ణు తెలిపారు.

ఆర్జీవీ నుండి ప్రశంసలు

మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప సినిమాపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌  27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న కన్నప్ప చిత్రాన్ని తాజాగా చూసినట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు. ఈ మూవీపై తన అభిప్రాయాన్ని వాట్సప్‌ ద్వారా మంచు విష్ణుతో పంచుకున్నారు. అయితే, ఇదే విషయాన్ని విష్ణు సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఆర్జీవీ పంపిన మెసేజ్‌ను కూడా స్క్రీన్‌ షాట్‌ తీసి షేర్‌ చేశారు.

మంచు విష్ణు స్పందన

కన్నప్ప సినిమా చూశానంటూ ఆర్జీవీ ఇలా మెసేజ్‌ చేశారు. ‘మొదటి నుంచి నాకు దేవుడు, భక్తి వంటి అంశాలపై నమ్మకం లేదు. ఈ కారణం వల్లే భక్తితో వచ్చే సినిమాలను నేను చూడలేదు. అయితే, నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో భక్త కన్నప్ప మూవీని నాలుగుసార్లు చూశాను. కానీ, ఆ సినిమాలో నటించిన నటీనటుల కోసమే చూశాను. ఇప్పటి కన్నప్ప సినిమా విషయానికొస్తే తిన్నడుగా నువ్వు అద్భుతంగా నటించావు అనడం కంటే జీవించేశావ్‌ అని చెప్పడం కరెక్ట్‌. ఆలయంమంత భక్తితో ఉన్న వ్యక్తిలా వెండితెరపై కనిపించావు. కొన్ని సీన్లు చూస్తున్నప్పడు నీ నటన అద్భుతం.. ఒక్కోసారి ఊపిరి తీసుకోనివ్వలేదే కూడా.. సినిమా క్లైమాక్స్‌లో శివలింగం నుంచి వచ్చే రక్తాన్ని ఆపేందుకు తిన్నడు తన రెండు కళ్లను సమర్పించే సీన్‌లో నీ నటన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది.

కన్నప్ప సినిమా విజయం

నేనొక నాస్తికుడిని. ఇలాంటి సన్నివేశాలు పెద్దగా నచ్చవు. కానీ, నీ నటనతో నన్ను మార్చేశావ్‌.. వాటిని ఇష్టపడేలా చేశావు. శివభక్తుడిగా నువ్వు నటించిన ఈ రోల్‌ ఎప్పికటికీ మాస్టర్‌క్లాస్‌గా నిలుస్తోంది. సినిమా చివరి సీన్‌లో నీవు పలికించిన భావోద్వేగాలు పతాకస్థాయికి చేరుతాయి. అప్పుడు ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.’ అని విష్ణుకు వాట్సాప్‌లో ఆర్జీవీ మెస్సేజ్‌ చేశారు. తన సినిమాపై ఆర్జీవీ చూపిన ప్రేమకు మంచు విష్ణు కూడా ఇలా రియాక్ట్‌ అయ్యారు. ‘రామూ గారు.. మీరు నన్ను ఏడిపించేశారు. చాలా రోజులుగా నా కన్నీళ్లను ఆపుకొంటున్నా. ఈ సినిమా నా జీవితంలో అత్యంత సవాల్‌తో కూడుకుంది. ఇప్పటి వరకు చాలామంది ఈ ప్రాజెక్ట్‌పై ద్వేషాన్నే చూపారు. కానీ, నమ్మకంతో ముందుకు వెళ్లాను.’ అని ఆయన అన్నారు.

ఆర్జీవీ ప్రశంసలతో కన్నప్ప సినిమా విజయం మరింతగా నిరూపించబడింది. సినిమాపై వచ్చిన విమర్శలను అధిగమించి విజయం సాధించడం మంచు విష్ణుకు సంతోషాన్నిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.