|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమిళనాడు ఎన్నికల వేళ సంచలనం: రూ.1049 కోట్ల ఆస్తులున్న అభ్యర్థి ఎవరో తెలుసా?

Published: 08-04-2026, 3:35 AM
తమిళనాడు ఎన్నికల వేళ సంచలనం: రూ.1049 కోట్ల ఆస్తులున్న అభ్యర్థి ఎవరో తెలుసా?
  • తమిళనాడు ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థిగా లీమారోస్ నిలిచారు.
  • లీమారోస్‌కు రూ. 1049 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
  • ఆమె లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత మార్టిన్ సతీమణి.
  • లీమారోస్ తన అఫిడవిట్‌లో తన ఆస్తులతో పాటు అప్పుల గురించి కూడా వెల్లడించారు.

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తుండటంతో, లాల్గుడి నియోజకవర్గం నుండి అన్నా డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లీమారోస్ పేరు మారుమోగుతోంది. ఆమె ఏకంగా రూ.1049 కోట్ల ఆస్తులతో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలవడం విశేషం.

లీమారోస్ ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి?

తమిళనాడులో (Tamil Nadu Elections) ఎన్నికల ఫీవర్ పీక్స్ కు చేరింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోవడంతో ఆయా పార్టీల తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే అత్యంత ధనిక అభ్యర్థిగా (Richest Candidate) ఓ మహిళా నిలవడంతో ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అన్నా డీఎంకే తరఫున లాల్గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లీమారోస్ (58) (Leema Rose) తమిళనాడులోనే అత్యధిక ధనిక అభ్యర్థిగా నిలిచారు. ఏకంగా తనకు రూ. 1049 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొనడంతో ఎవరీ లీమారోస్ అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

ఆస్తుల చిట్టా: లీమారోస్ అఫిడవిట్ వివరాలు

లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత మార్టిన్ సతిమణే ఈ లీమారోస్. అన్నా డీఎంకే తరఫున బరిలో నిలిచిన ఈవిడ తన అఫిడవిట్‍లో రూ.తన పేరుపై 19 కిలోల బంగారం, 1,217 క్యారెట్ల వజ్రాలు, 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రూ.139.63 కోట్ల చరాస్తులు, రూ. 909.94 కోట్ల స్థిరాస్తులు, రూ. 8.57 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఇంత ఆస్తులు ఉన్నప్పటికీ తాను చదివింది మాత్రం కేవలం ఆరో తరగతి వరకు మాత్రమేనని పేర్కొంది. తనపై 4 కేసులు పెండింగ్‍లో ఉన్నట్లు తెలింపింది. 1967లో దేవకోట్టైలో జన్మించిన ఆమె, ప్రస్తుతం మార్టిన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూనే రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రాజకీయాల్లో లీమారోస్ అదృష్ట పరీక్ష

ఇక తన భర్త మార్టిన్‌ పేరు మీద రూ.887.36 కోట్ల విలువైన చరాస్తులు, రూ.3,262 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని లీమారోస్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. భర్త పేరున 281 గ్రాముల బంగారం, 9.83 క్యారెట్ల వజ్రాలు, 21 కిలోల వెండి, 321 గ్రాముల విలువైన ముత్యాలు ఉన్నాయని, కుమారుడు జోస్‌ చార్లెస్‌ మార్టిన్‌ పేరున రూ.655 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.

మొత్తానికి, లీమారోస్ భారీ ఆస్తులతో ఎన్నికల బరిలో నిలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.