
📌 Key Points
- ప్రభాస్‌తో నయనతార రొమాన్స్: ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్, ఆస్తి రూ. 200 కోట్లు!
- దీపికా పదుకొణె: ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్‌బస్టర్, రూ. 500 కోట్ల ఆస్తి!
- అనుష్క శెట్టితో ప్రభాస్ హిట్ జోడీ: ‘బాహుబలి’, ‘మిర్చి’ చిత్రాలతో రూ. 134 కోట్ల ఆస్తి.
- తమన్నా భాటియా: ప్రభాస్‌తో ‘బాహుబలి’, ‘రెబల్’ చిత్రాల్లో మెరుపులు, ‘ఆజ్ కీ రాత్’ సాంగ్‌తో వైరల్.
ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోలలో ఒకరు. ఆయన సినిమాల్లో నటించిన హీరోయిన్లు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్‌తో కలిసి నటించిన హీరోయిన్ల ఆస్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభాస్‌తో నటించిన లేడీ సూపర్ స్టార్ ఎవరు?
ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోల్లో ప్రభాస్ ఫస్ట్ ప్టేస్‌లో ఉంటారు. ఆయన ఫ్లాప్ మూవీ కూడా రెండు మూడు వందల కోట్లు వసూలు చేస్తుండటం విశేషం. అది ఆయన రేంజ్‌ని తెలియజేస్తుంది. ఈ కలెక్షన్లు ఇతర హీరోలకు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్స్ తో సమానం కావడం విశేషం. ప్రభాస్ తన సినిమాలతో ఎంతో మంది హీరోయిన్లకి లైఫ్ ఇచ్చారు. వాళ్లు స్టార్స్ గా ఎదిగారు. మరి ఆయనతో పనిచేసిన రిచ్చెస్ట్ హీరోయిన్లు ఎవరనేది తెలుసుకుందాం.
ప్రభాస్‌తో `మున్నా` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది నయనతార. ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె ఆస్తి రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. నయనతార ఇటీవల చిరంజీవితో ‘మన్ శంకర్ వర ప్రసాద్ గారు’ సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది.
ప్రభాస్-దీపికా పదుకొణె ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కలిసి పనిచేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో దీపికా ఒక హాట్ కేక్‌లా మారింది. అలాంటి దీపిక ఆస్తులు చూస్తే, ఆమె రూ. 500 కోట్ల ఆస్తికి యజమానురాలు అని సమాచారం. ఆమె సంపదతో `ధురంధర్` లాంటి సినిమాలు మూడు తీయొచ్చు.
దీపికా పదుకొణె ఆస్తుల వివరాలు
ప్రభాస్, కాజల్ అగర్వాల్ కలిసి `డార్లింగ్`, `మిస్టర్ పర్‌ఫెక్ట్` చిత్రాలు చేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. హిట్ జోడీగానూ నిలిచింది. ప్రస్తుతం చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న కాజల్ రూ.83 కోట్ల ఆస్తికి యజమానురాలు కావడం విశేషం.
ప్రభాస్ కృతి సనన్‌తో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో పనిచేశారు. రూ.700 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక కృతి సంపద గురించి మాట్లాడితే, ఆమెకు రూ.90 కోట్ల ఆస్తి ఉందని సమాచారం.
ప్రభాస్, అనుష్క శెట్టి జోడీని అభిమానులు చాలా ఇష్టపడతారు. ఇద్దరూ కలిసి చాలా హిట్ సినిమాలు ఇచ్చారు. అందులో `బాహుబలి` రెండు సినిమాలు, `మిర్చి`, `బిల్లా` వంటి చిత్రాలున్నాయి. అనుష్క ఆస్తి గురించి మాట్లాడితే, ఆమె రూ. 134 కోట్లకి యజమానురాలు అని సమాచారం.
అనుష్క శెట్టి సంపాదన ఎంతో తెలుసా?
తమన్నా భాటియా, ప్రభాస్ చాలా హిట్ సినిమాల్లో నటించారు. `బాహుబలి` రెండు చిత్రాలు, `రెబల్`లో కలిసి నటించారు. వీరిద్దరి జోడీని తెరపై చూసేందుకు అభిమానులు ఇష్టపడతారు. తమన్నా ఇటీవల `ఆజ్ కీ రాత్` సాంగ్‌తో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆమె నర్తించిన ఈ పాట వంద కోట్ల వ్యూస్‌ని సాధించడం విశేషం. మరి తమన్నా ఆస్తులు చూస్తే, ఆమెకి రూ. 120 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.
ప్రభాస్, త్రిష కూడా హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరు కలిసి `వర్షం`, `బుజ్జిగాడు`, `పౌర్ణమి` చిత్రాల్లో నటించారు. సౌత్ క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న త్రిషకి రూ. 85 కోట్ల ఆస్తులున్నాయని సమాచారం. ఈ లెక్కన దీపికా పదుకొనె రిచ్చెస్ట్ హీరోయిన్ గా చెప్పొచ్చు.
ప్రభాస్‌తో నటించిన హీరోయిన్ల ఆస్తుల గురించి తెలుసుకున్నారు కదా. మరింత ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. టాలీవుడ్ సమాచారం ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తూ ఉంటాం.


