|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rishab Shetty: కాంతార చాప్టర్-1.. కోలీవుడ్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

Published: 29-09-2025, 5:18 PM
Rishab Shetty: కాంతార చాప్టర్-1.. కోలీవుడ్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్-1’ ప్రీక్వెల్ ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైంది. ఇటీవల జరిగిన కరూర్‌ ఘటన కారణంగా నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోలీవుడ్ అభిమానులకు నిరాశ ఎదురైంది.

Key Points

1

కాంతార చాప్టర్-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో రద్దైంది.

2

ఇటీవల జరిగిన కరూర్‌ ఘటన నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

4

సరైన సమయంలో తమిళనాడు ప్రేక్షకులను కలుస్తామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాంతార చాప్టర్-1 చెన్నై ఈవెంట్ రద్దు

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం కాంతార చాప్టర్-1. ఈ మూవీని కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు అంతా సిద్ధమైంది. దీంతో కాంతార మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించగా.. తాజాగా ముంబయిలోనూ బిగ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు.

కరుర్ ఘటనతో నిర్మాతల కీలక నిర్ణయం

కోలీవుడ్ ఫ్యాన్స్‌కు నిరాశ: నిర్మాతల సందేశం

అయితే మంగళవారం చెన్నైలో కాంతార చాప్టర్‌-1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగాల్సి ఉంది. ఇటీవల జరిగిన కరూర్‌ ఘటన నేపథ్యంలో కాంతార నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు చెన్నైలో జరగాల్సిన ప్రమోషనల్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఘటనతో ప్రభావితమైన వారి కోసం  ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. సరైన సమయంలో తమిళనాడు ప్రేక్షకులను కలవడానికి మేము ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

నిర్మాతలు అభిమానుల అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సరైన సమయంలో తమిళనాడు ప్రేక్షకులను కలుస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో ప్రభావితమైన వారి కోసం ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.