
📌 Key Points
- రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందరినీ అన్‌ఫాలో చేశారు.
- ముగ్గురిని మాత్రమే ఫాలో అవుతున్న రిషబ్: ఇద్దరు నిర్మాణ సంస్థకు చెందినవారు, ఒకరు భార్య.
- పాన్ ఇండియా ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి సోషల్ మీడియాకు దూరం కావాలని నిర్ణయం.
- జై హనుమాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలతో బిజీగా ఉన్న రిషబ్.
ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అందరినీ అన్‌ఫాలో చేసి సంచలనం సృష్టించారు. కేవలం ముగ్గురిని మాత్రమే ఫాలో అవుతూ, మిగతా వారందరినీ అన్‌ఫాలో చేయడానికి గల కారణం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
రిషబ్ శెట్టి ఎందుకు అన్‌ఫాలో చేశారు?
Rishab Shetty: రిషబ్ శెట్టి పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ నటుడిగా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. దర్శకుడిగా కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైన రిషబ్ శెట్టి (Rishab Shetty)కాంతార (Kantara) సినిమాతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో రిషబ్ క్రేజ్ కూడా అదే స్థాయిలో మారుమోగుతుంది. ఇలా కాంతార సినిమా తర్వాత ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ రిషబ్ ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈయన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై హనుమాన్ (Jai Hanuman)సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న రిషబ్ శెట్టి తాజాగా తన ఇన్సగ్రామ్ వేదికగా ఫాలో అవుతున్న వారందరినీ కూడా అన్ ఫాలో చేసేసారు. ఇలా ఇంస్టాగ్రామ్ లో తనని ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరినీ కూడా ఈయన అన్ ఫాలో చేయడంతో ఒక్కసారిగా ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ముగ్గురినే ఫాలో అవుతున్న రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి కేవలం ఇంస్టాగ్రామ్ లో ముగ్గురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అయితే ఈ ముగ్గురిలో రెండు తన నిర్మాణ సంస్థకు సంబంధించిన అకౌంట్లు కాగా మరొకటి తన భార్య ప్రగతి ఇంస్టాగ్రామ్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో తనకు ఎంతో మంచి సక్సెస్ అందించిన వారందరినీ కూడా ఈయన అన్ ఫాలో చేయడంతో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రిషబ్ ఇలా అన్ ఫాలో చేయడానికి కూడా కారణం లేకపోలేదని చెప్పాలి. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఒకవైపు జై హనుమాన్ సినిమాతో పాటు మరోవైపు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
గోప్యత కోసమే అన్ ఫాలో చేశారా?
పాన్ ఇండియా ప్రాజెక్టులే కారణమా?
ఇలా పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీ అవుతున్న ఈయన పూర్తిస్థాయిలో ఈ సినిమాలపై దృష్టి సాధించలన్న ఉద్దేశంతోనే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో అందరిని అన్ ఫాలో చేశారని తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీలు నటిస్తున్న సినిమాల విషయంలో మంచి హైప్ క్రియేట్ చేయడం కోసం లేదా వారి వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచడం కోసం ఈ విధమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. మరి రిషబ్ ఏ ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది తెలియాలి అంటే ఆయన స్పందించాల్సి ఉంది.
రిషబ్ శెట్టి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆయన పాన్ ఇండియా సినిమాలపై దృష్టి సారించాలనే ఉద్దేశ్యం ఉంది. ఆయన భవిష్యత్ ప్రాజెక్టుల కోసం వేచి చూద్దాం.


