|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఫ్రెండ్స్‌ను అన్‌ఫాలో చేసిన రిషబ్ శెట్టి! అసలేం జరిగిందో చెప్పిన ప్రమోద్ శెట్టి!!

Published: 03-04-2026, 2:05 PM
షాకింగ్: ఫ్రెండ్స్‌ను అన్‌ఫాలో చేసిన రిషబ్ శెట్టి! అసలేం జరిగిందో చెప్పిన ప్రమోద్ శెట్టి!!
  • రిషబ్ శెట్టి సంచలనం: స్నేహితులను, హోంబలే ఫిలిమ్స్‌ను అన్‌ఫాలో చేసి షాక్!
  • అసలు కారణం చెప్పకుండా దాటవేసిన రిషబ్: ప్రమోద్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.
  • నిర్మాతగా మంచి ప్రాజెక్టులు చేయాలనే ఆలోచనలో రిషబ్ ఉన్నట్లు ప్రమోద్ వెల్లడి.
  • హోంబలే ఫిలిమ్స్‌ను అన్‌ఫాలో చేయడానికి గల కారణం త్వరలో తెలుపుతానన్న రిషబ్.

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఒక్కసారిగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. తన స్నేహితులను, హోంబలే ఫిలిమ్స్‌ను అన్‌ఫాలో చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దీనిపై నటుడు ప్రమోద్ శెట్టి స్పందించారు.

రిషబ్ సంచలన నిర్ణయం: స్నేహితులకు షాక్

కన్నట స్టార్ రిషబ్ శెట్టి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిస్తున్నారు. సోషల్ మీడియాలో తన స్నేహితులు రాజ్, రక్షిత్, ప్రమోద్‌లతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఖాతాలను అన్‌ఫాలో చేసి సంచలనం సృష్టించారు. దీంతో వారి మధ్య ఏవో వివాదాలు నడుస్తున్నాయని అందుకే ఆయన అన్‌ఫాలో చేశారంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే.. దీనిపై తాజాగా రిషబ్ శెట్టి ఫ్రెండ్, నటుడు ప్రమోద్ శెట్టి రియాక్ట్ అయ్యారు. ‘రిషబ్, రక్షిత్, రాజ్, నేను మంచి స్నేహితులం. ఆ విషయం అందరికి తెలుసు. సినిమా టైమ్‌లోనే మేమంతా సోషల్ మీడియాను వాడుతుంటాం. తర్వాత అంత యాక్టీవ్‌గా ఉండము. ఇటీవల రిషబ్ మా ఖాతాలను అన్‌ఫాలో చేశారనే విషయం వేరే వాళ్ల ద్వారా నాకు తెలిసింది. రిషబ్ ఎందుకిలా చేశారనేది పూర్తిగా తెలియదు కానీ, తర్వాత ఒకసారి కలిస్తే.. నిర్మాతగానూ మంచి ప్రాజెక్టులు ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నానని తను నాతో చెప్పాడు. అయితే.. హోంబలే ఫిలిమ్స్‌ను అన్‌ఫాలో చేయడానికి గల కారణాన్ని నిదానంగా చెప్తాను అన్నారు’ అని చెప్పుకొచ్చాడు ప్రమోద్.

అన్‌ఫాలో వెనుక అసలు కారణం ఇదేనా?

నిర్మాతగా మారనున్న రిషబ్ శెట్టి

రిషబ్ శెట్టి అన్‌ఫాలో వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి గల కారణాలు త్వరలోనే తెలుస్తాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.