|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీకృష్ణ దేవరాయల బయోపిక్‌లో రిషబ్ శెట్టి.. హైప్ పెంచుతున్న ట్వీట్

Published: 13-07-2025, 11:12 AM
శ్రీకృష్ణ దేవరాయల బయోపిక్‌లో రిషబ్ శెట్టి.. హైప్ పెంచుతున్న ట్వీట్

‘కాంతార’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన రిషబ్ శెట్టి, తాజాగా శ్రీకృష్ణదేవరాయల బయోపిక్‌లో నటించనున్నారు. ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించే ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

Key Points

1

రిషబ్ శెట్టి 'కాంతార' తర్వాత శ్రీకృష్ణదేవరాయల బయోపిక్‌లో నటిస్తున్నారు.

2

ఈ చారిత్రక చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్నారు.

4

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

రిషబ్ శెట్టి – కొత్త బయోపిక్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార’(Kantara) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్రముగ్దులయ్యేలా చేశారు. ఈ మూవీ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయన నటనకు బాగానే మార్కులు పడ్డాయి. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అలాగే మరాఠా యోధుడు ఛత్రపతి పాత్రలోనూ కనిపించనున్నాడు. అంతేకాకుండా ‘జై హనుమాన్’ చిత్రంలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా, రిషబ్ శెట్టి ఓ భారీ హిస్టారికల్ చిత్రాన్ని ఒకే చేసినట్లు సమాచారం. ఆంధ్రభోజుడు, విజయ నగరం సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు పానిపట్, జోధా అక్బర్, లగానం వంటి సినిమాలు తెరకెక్కించిన అశుతోష్ గోవారికర్(Ashutosh Gowariker) దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అశుతోష్ గోవారికర్ దర్శకత్వం

సోషల్ మీడియాలో హైప్

రిషబ్ శెట్టి నటనతో ఈ చారిత్రక చిత్రం ప్రేక్షకులను అలరించడం ఖాయం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుంది. సినిమా ప్రేమికులకు ఇది గొప్ప వార్త.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.