
📌 Key Points
- కాంతార సినిమాతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు.
- కాంతార చాప్టర్ 1 చిత్రం 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
- తెలుగులో పలు సినిమాలకు రిషబ్ శెట్టి కమిట్ అయ్యారు.
- సినిమాల కోసం రిషబ్ శెట్టి 80 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
రిషబ్ శెట్టి కాంతార సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఆయన తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తెలుగులో పలు సినిమాల్లో నటిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్‌గా రిషబ్ శెట్టి
Rishabh Shetty: కన్నడ స్టార్ డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కెరీర్ మొదలు దర్శకుడుగా కొనసాగుతున్న ఈయన కాంతార సినిమాతో నటుడిగా తెరపైకి వచ్చారు. రిషబ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరుస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా కేవలం కన్నడలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆతరణ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు ఫ్రీక్వల్ చిత్రం కాంతార చాప్టర్ 1 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో రిషబ్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది ఈ నేపథ్యంలోనే ఈయనకు ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలకు కమిట్ అయిన రిషబ్ శెట్టి ఈ సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రిషబ్ శెట్టి కాంతార 1 సినిమా మంచి సక్సెస్ కావడంతో రెమ్యూనరేషన్ భారీగా పెంచారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాలకు 80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇదివరకు 30 నుంచి 40 కోట్లు తీసుకునే రిషబ్ ఒకేసారి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.
భారీగా పెరిగిన రిషబ్ రెమ్యూనరేషన్
ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వడం అంటే నిర్మాతలకు కూడా తలకు మించిన భారమే అవుతుందని చెప్పాలి. రిషబ్ శెట్టి కాంతార ఫ్రాంచైజీస్ తో పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలోనే రెమ్యూనరేషన్ కూడా పెంచారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై హనుమాన్(Jai Hanuman) సినిమాలో నటిస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఉన్నఫలంగా ఈయన రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు కూడా పునరాలోచనలో పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రిషబ్ శెట్టి జై హనుమాన్ సినిమాతో పాటు కాంతార సీక్వెల్ సినిమా పనులలో కూడా బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. త్వరలోనే కాంతర సీక్వెల్ పనులు ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.కాంతార యూనివర్స్ నుంచి సీక్వెల్ మాత్రమే కాదు మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని రిషబ్ శెట్టి తెలియజేశారు మరి కాంతార ఫ్రాంచైజీస్ ద్వారా రిషబ్ శెట్టి ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తారు తెలియాల్సి ఉంది.
రిషబ్ శెట్టి నటిస్తున్న సినిమాలు
కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. రాబోయే సినిమాలతో ఆయన ఇంకెలాంటి విజయాలు సాధిస్తారో చూడాలి.


