|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రీతూ చౌదరి వివాదాస్పద పెళ్లి బ్రేకప్ కథ: బిగ్ బాస్ తర్వాత షాకింగ్ నిజాలు!

Published: 05-01-2026, 7:00 AM
రీతూ చౌదరి వివాదాస్పద పెళ్లి బ్రేకప్ కథ: బిగ్ బాస్ తర్వాత షాకింగ్ నిజాలు!
  • బిగ్‌బాస్, స్టార్ మా పరివార్ షోలలో డీమాన్ పవన్‌తో రీతూ సన్నిహితంగా ఉంది.
  • రీతూ చౌదరి, శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నట్లు వెల్లడించింది.
  • రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్‌తోపాటు, ధర్మ మహేష్‌తో రిలేషన్ ఆరోపణలు రీతూని వివాదాల్లోకి నెట్టాయి.
  • మెడలోని తాళిని తీసుకెళ్లడంతో విడాకులు రాలేదని, చాలా రోజులుగా జరిగిన గొడవల వల్లే దూరం పెరిగిందని రీతూ స్పష్టం చేసింది.

బిగ్‌బాస్ షో తర్వాత రీతూ చౌదరి మరోసారి వార్తల్లో నిలిచింది. డీమాన్ పవన్‌తో ఆమె ప్రేమాయణం హాట్ టాపిక్‌గా మారగా, గతంలో ఆమె వివాదాస్పద పెళ్లి, విడాకుల గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ల్యాండ్ స్కామ్, వ్యక్తిగత గొడవలతో ఆమె జీవితం ఎలా మారిందో తెలుసుకోండి.

బిగ్‌బాస్, పవన్‌తో రీతూ ప్రేమాయణం

రీతూ చౌదరీ ఇటీవల బిగ్‌ బాస్‌ షోలో సందడి చేసింది. ఆమె స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఉంటూ అందరిని ఆకట్టుకుంది. డీమాన్‌ పవన్‌తో కలిసి ఆమె చేసిన రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఇద్దరు రియల్‌ లవర్స్ గా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. డీమాన్‌ పవన్‌ తనకు చాలా ఇంపార్టెంట్‌ అని ప్రకటించింది రీతూ. పవన్‌ సైతం రీతూ గురించి గొప్పగా చెప్పాడు. అంతేకాదు ఇటీవల ఆదివారం స్టార్ మా పరివార్‌లో వీరు పాల్గొన్నారు. ఇందులో పవన్‌కి ముద్దు కూడా పెట్టింది రీతూ. బిగ్‌ బాస్‌ షోలో అది సాధ్యం కాలేదు, ఆ కోరికని ఇందులో తీర్చుకుంది.

అయితే అంతకు ముందు రీతూ చౌదరీ గురించిన చాలా విషయాలు మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఆమె చుట్టూ  పెద్ద వివాదం నడిచింది. శ్రీకాంత్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని రీతూ చౌదరీ పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని తనే ఒప్పుకుంది. ఏడెనిమిది నెలలు కలిసి సహజీవనం చేశారు. గోవాకి మూడు నాలుగు సార్లు వెళ్లారు కూడా. అయితే వీరికి సంబంధించిన రూ.700కోట్ల ల్యాండ్‌ స్కామ్‌ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత శ్రీకాంత్‌ గురించి కొన్ని నిజాలు తెలియడంతో ఆయన్నుంచి దూరంగా ఉంది రీతూ. అనంతరం ఆమె బిగ్‌ బాస్‌ షోకి వెళ్లింది.

రీతూ చౌదరి వివాదాస్పద పెళ్లి, ల్యాండ్ స్కామ్

బిగ్‌ బాస్‌ షోకి వెళ్లాక కూడా ఆమెపై అనేక వార్తలొచ్చాయి. హీరో ధర్మ మహేష్‌తో రిలేషన్‌ కి సంబంధించిన విషయాలు కూడా బయటకు వచ్చాయి. ధర్మ మహేష్‌ భార్య ఆరోపణలు చేసింది. ఇవన్నీ రీతూని వార్తల్లో నిలిపాయి. వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి. అయితే తాజాగా రీతూకి సంబంధించిన పాత ఇంటర్వ్యూలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇందులో ఆమె పెళ్లి విషయానికి సంబంధించిన విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. తన ఫాదర్‌ ఉన్నప్పుడే శ్రీకాంత్‌ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు చెప్పింది. రిజిస్టేషన్‌ మ్యారేజ్‌ కూడా చేసుకున్నట్టు తెలిపింది. అనంతరం ఆరేడు నెలలు కలిసి ఉన్నారట.

ల్యాండ్‌ స్కామ్‌ విషయం బయటకు వచ్చాక శ్రీకాంత్‌తోపాటు రీతూపై కూడా ఎసీబీ దాడులు జరిగాయి. దీంతో రీతూ మెడలో ఉన్న మంగళసూత్రం కూడా తీసుకెళ్లిపోయారట. ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్నట్టుగా శ్రీకాంత్‌ చెప్పాడని, కానీ అసలు విషయం అది కాదని, తమ మధ్య చాలా రోజులుగా గొడవలు జరిగాయని తెలిపింది. కొట్టుకునే స్థాయికి వెళ్లినట్టుగా ఆమె చెప్పకనే చెప్పింది. మహా టీవీలో రీతూ మాట్లాడుతూ  ఈ విషయాలను పంచుకుంది. చాలా రోజులుగా గొడవలు జరిగాయట. ఈ క్రమంలో కొట్టుకున్నట్టుగానూ రీతూ చెప్పింది. కాకపోతే దాన్ని డైరెక్ట్ గా ఒప్పుకోలేదు. మొదట విడాకులు వెళితే తాను ఒప్పుకోలేదట. ఆ తర్వాత అతను ఒప్పుకోవడం లేదట. ఇప్పుడు తమ విడాకుల విషయం కోర్ట్ లో ఉందని చెప్పింది రీతూ. ఏడాదిన్నరగా విడాకుల మ్యాటర్‌ కోర్ట్ లోనే ఉందని, డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పింది.

తాళి, విడాకులపై రీతూ చౌదరి స్పష్టత

అయితే ఈ విషయంలో తాను మోసపోయినట్టు చెప్పింది. తనకు ల్యాండ్‌ స్కామ్‌ విషయంలో ఎలాంటి సంబంధం లేదని, తనకు తెలియదని చెప్పింది.  తన పేరుతో రాయించిన ల్యాండ్‌ విలువ ఎంత ఉంటుందో కూడా తెలియదని, సైన్‌ పెట్టమంటే పెట్టినట్టు, రూ.700కోట్ల స్కామ్‌కి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.

అయితే బిగ్‌ బాస్‌ షోకి వచ్చాక కూడా రీతూపై ఉన్న ఇమేజ్‌ పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు ఆమెపై చాలా నెగటివిటీ ఉండేది. ఈ స్కామ్‌ బయటపడ్డాక మరింత నెగటివిటీ వచ్చింది. కానీ బిగ్‌ బాస్‌ షో ఆమె ఇమేజ్‌ని పూర్తిగా మార్చేసింది. రీతూ ఇన్నోసెంట్‌ అనేది బాగా ప్రొజెక్ట్ అయ్యింది. అయితే షోలోకి వెళ్లే ముందు కూడా తన పేరు వనం దివ్య కాదు అని, ఆ బ్యాడ్‌ ఇమేజ్‌ నుంచి బయటపడేందుకే వెళ్తున్నట్టుగా చెప్పింది. అంతిమంగా ఆ విషయంలో సక్సెస్‌ అయ్యింది రీతూ. ఇమేజ్‌ డ్యామేజ్‌ని కంట్రోల్‌ చేసుకుంది. మరి రియల్ వివాదాల నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

మొత్తం మీద, బిగ్‌బాస్ షో రీతూ చౌదరి జీవితంలో ఒక మలుపు అని చెప్పొచ్చు. ఆమె గత వివాదాలు, ల్యాండ్ స్కామ్, వ్యక్తిగత గొడవలపై తాజాగా ఇచ్చిన క్లారిటీ, పవన్‌తో కొత్త బంధం.. అన్నీ ఆమెను నిరంతరం వార్తల్లో నిలుపుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.