|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రీతూ-డీమాన్‌ పవన్‌ లవ్‌ ట్రాక్‌ ప్రీ ప్లానేనా? శ్రీజ చెప్పిన సంచలన నిజం!

Published: 25-12-2025, 8:36 AM
రీతూ-డీమాన్‌ పవన్‌ లవ్‌ ట్రాక్‌ ప్రీ ప్లానేనా? శ్రీజ చెప్పిన సంచలన నిజం!
  • బిగ్ బాస్ 9లో డీమాన్ పవన్ మూడో స్థానంలో నిలిచి 15 లక్షలు గెలుచుకున్నాడు.
  • హౌస్‌లో రీతూ చౌదరీతో పవన్ సన్నిహితంగా మెలిగి ప్రేమ ట్రాక్ నడిపాడు.
  • రీతూ ఎలిమినేషన్ తర్వాత పవన్ ఆటలో మరింత చురుగ్గా మారాడు.
  • లవ్ ట్రాక్ ప్లాన్ ప్రకారమే అని శ్రీజ శివాజీకి చెప్పిందని ప్రచారం.

బిగ్‌ బాస్ తెలుగు 9 ముగిసినా, డీమాన్‌ పవన్‌ చర్చల్లో ఉన్నాడు. హౌస్‌లో రీతూ చౌదరీతో అతని ప్రేమ ట్రాక్ అందరినీ ఆకర్షించింది. అయితే, ఈ ప్రేమ ట్రాక్ ముందుగానే ప్లాన్ చేసుకున్నదని శ్రీజ చెప్పిన సంచలన నిజం ఇప్పుడు బయటపడింది.

బిగ్ బాస్ 9లో డీమాన్ పవన్ ప్రయాణం

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ షో విజయవంతంగా ముగిసింది. ఆదివారంతో ఈ షో క్లోజ్‌ అయిన విషయం తెలిసిందే. కామన్‌ మేన్‌ కేటగిరిలో హౌజ్‌లోకి వచ్చిన కళ్యాణ్‌ పడాల విన్నర్ గా నిలిచాడు. తనూజ, ఇమ్మాన్యుయెల్‌, సంజనా వంటి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లని దాటుకొని ఆయన దూసుకుపోయాడు. విన్నర్‌గా నిలిచాడు. ఇక మరో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ డీమాన్‌ పవన్‌ మూడో స్థానంలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

డీమాన్‌ పవన్‌ కూడా కామన్‌ మేన్‌ కేటగిరిలోనే హౌజ్‌లోకి వచ్చాడు. నెమ్మదిగా పుంజుకుంటూ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా నిలిచాడు. కామనర్స్ గా వచ్చిన శ్రీజ, ప్రియా, మర్యాద మనీష్‌, హరిత హరీష్‌, దివ్య వంటి వారు ప్రారంభంలోనే వెళ్లిపోగా, కళ్యాణ్‌తోపాటు డీమాన్‌ పవన్‌ మాత్రమే ఫైనల్‌ వరకు ఉన్నాడు. మూడో స్థానంలో వైదొలిగాడు. అయితే 15 లక్షల సూట్‌కేసుని తీసుకుని ఆయన ఫైనల్‌ పోటీ నుంచి తప్పుకోవడం విశేషం. దీంతో ఆల్మోస్ట్ విన్నర్ రేంజ్‌ ప్రైజ్‌ మనీతో, సెలబ్రిటీ కంటెస్టెంట్ల రేంజ్‌లో పారితోషికం దక్కించుకోవడం విశేషం.

రీతూ చౌదరీతో పవన్ లవ్ ట్రాక్

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో డీమాన్‌ పవన్ ఎక్కువగా రీతూ చౌదరీతోనే ఉన్నాడు. ఆయన రెండు మూడు వారాల నుంచే ఆమెకి క్లోజ్‌ అయ్యాడు. ఇద్దరు ప్రేమలో ఉన్నారనేంతగా హౌజ్‌లో మెలిగారు, అంతే బాగా మెప్పించారు. తమ మధ్య కెమిస్ట్రీని పండించారు. అయితే రీతూ ఎలిమినేట్‌ అయిన తర్వాత డీమాన్‌ పవన్‌ యాక్టివ్‌గా కనిపించాడు. బాగా ఓపెన్‌ అయ్యాడు. ఎంటర్‌టైన్‌ చేయడంలోనూ, గేమ్స్ పరంగానూ అదరగొట్టారు. ముందు నుంచి ఇలానే ఉంటే వేరే స్థాయిలో ఉండేవాడని అంతా అనుకున్నారు. హౌజ్‌లోనే కాదు, బయట కూడా అదే టాక్ వినిపించింది. అయితే తాజాగా ఇదే ప్రశ్న ఆయనకు ఎదురయ్యింది.

శ్రీజ నిజం, శివాజీ ప్రశ్నలు

బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే నుంచి బయటకు వచ్చాక శివాజీతో టాక్‌ షోలో మాట్లాడాడు. ఇందులో హౌజ్లోకి వెళ్లాక లవ్ ట్రాక్‌ కచ్చితంగా వర్కౌట్‌ అవుతుంది. ట్రై చేస్తాను అని శ్రీజతో డీమాన్‌ పవన్‌ చెప్పాడట. ఆమె శివాజీతో చెప్పిందట. అదే విషయాన్ని ప్రశ్నించాడు శివాజీ. అలాంటిది నిజం కాదని, ఆర్గానిక్‌గా జరిగిందన్నాడు పవన్‌. అయితే ఆర్గానిక్‌ అనుకున్నాం, కానీ హైబ్రీడ్‌ అని తర్వాత తెలిసిందని శివాజీ అడగడంతో, డీమాన్‌ పవన్‌ నోరెళ్లబెట్టాడు. బయట ఎలా ఉంటానో, లోపల అలా ఉన్నాను అని చెప్పాడు పవన్‌. కానీ అందరు ఇదే చెబుతున్నారని శివాజీ చెప్పడంతో మళ్లీ షాక్‌ అయ్యాడు పవన్‌. దీని బట్టి చూస్తే డీమాన్‌ పవన్‌ లవ్‌ ట్రాక్‌ వర్కౌట్‌ చేసుకోవాలని ప్లాన్‌ చేసుకునే వెళ్లాడని అర్థమవుతుంది. అయితే ఓ దశలో ఆయనకు ఆ ట్రాకే మైనస్‌ మారింది. చివరి వారాల్లో ఉన్నట్టుగా ముందు నుంచి ఉంటే, టైటిల్‌ రేసులో డీమాన్‌ పవన్‌ ఉండేవాడనే టాక్‌ వినిపించింది. ఏదేమైనా టాప్‌ 3లో 15 లక్షల సూట్‌ కేసుతో బయటకు రావడం విశేషం.

డీమాన్‌ పవన్‌ లవ్ ట్రాక్‌పై శ్రీజ చెప్పిన నిజం బిగ్ బాస్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. పవన్ ఖండించినా, శివాజీ ప్రశ్నలు ఈ విషయంలో సస్పెన్స్‌ను పెంచాయి. నిజంగానే పవన్ లవ్ ట్రాక్ ప్లాన్ చేశాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.