
📌 Key Points
- BB జోడీ 2లో రీతూ, పవన్ జోడి ఎంట్రీతో అంచనాలు పెరిగాయ్!
- సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయకపోవడంతో 5 ఎపిసోడ్లకే ఎలిమినేట్ అయిన రీతూ, పవన్.
- ఎలిమినేషన్‌కు కొరియోగ్రాఫర్ కారణమంటూ రీతూ కామెంట్స్!
- ఒక్కో ఎపిసోడ్‌కు రూ.4 లక్షల రెమ్యునరేషన్ అందుకున్న రీతూ, పవన్!
బిగ్ బాస్ జోడీ సీజన్ 2లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. రీతూ చౌదరి, డిమోన్ పవన్ జంట ఎలిమినేట్ కావడం సంచలనంగా మారింది. వారి రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్.
BB జోడీ 2లో రీతూ, పవన్ ఎంట్రీ!
బిగ్ బాస్ సీజన్ అయిపోగానే.. అందులో కంటెస్టెంట్స్ తో ఏదో ఒక కార్యక్రమం మొదలు పెడుతుంటారు. ఈమధ్య కాలంలో BB జోడీ పేరుతో ఓ షో పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ను జంటలు గా మార్చి.. డాన్స్, పెర్ఫామెన్స్ లతో ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈక్రమంలో ఈ షోలో పాపులర్ జంటలు.. బిగ్ బాస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన జంటలు కూడా కనిపిస్తుంటారు. ఈసారి BB జోడీ సీజన్ 2 లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్ రీతూ, డిమోన్ పవన్ సందడి చేశారు.
బుల్లితెరపై ప్రస్తుతం విజయవంతంగా ప్రసారమవుతున్న రియాలిటీ షోలలో BB జోడీ సీజన్ 2 ఒకటి. బిగ్ బాస్ 9 ముగిసిన వెంటనే ప్రారంభమైన ఈ డ్యాన్స్ రియాలిటీ షోకు మొదటి ఎపిసోడ్ నుంచే మంచి స్పందన లభించింది. ప్రస్తుతానికి ఈ సీజన్ టైటిల్ విన్నింగ్ రేస్ అమర్ దీప్–నైనిక జంట, మానస్–శ్రేష్టి వర్మ జంటల మధ్య జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు జంటలు హోరా హోరీగా తమ ట్యాలెంట్ ను చూపిస్తూ.. పోటీపడుతున్నాయి.
5 ఎపిసోడ్లకే ఎలిమినేషన్.. కారణం ఇదేనా?
బిగ్ బాస్ లో బాగా ఫేమస్ జంటలను ఈ BB జోడీ లోకి దింపడం కామన్.. అందులో భాగంగానే ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో జంటగా సందడి చేసిన రీతూ చౌదరి, డిమోన్ పవన్ ఎంట్రీ ఇచ్చారు. వీరి ఎంట్రీతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక డ్యాన్స్ కు డ్యాన్స్ .. డ్యాన్స్ తో పాటు మంచి ఎంటర్ టైమ్మెంట్ కూడా ఉంటుంది అని అంతా అనుకున్నారు. వీరిపై భారీగా అంచనాలు కూడా పెట్టుకున్నారు. కానీ యావరేజ్ డ్యాన్స్ తో ఆడియన్స్ ను ఒక రకంగా నిరాశకు గురి చేసినట్టు తెలుస్తోంది. దాంతో పట్టుమని పది ఎపిసోడ్స్ కూడా ఉండకుండా.. కేవలం 5 ఎపిసోడ్లకే ఎలిమినేట్ కావాల్సివచ్చింది.
ఈ ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అందులో రీతూ చౌదరి, పవన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయానని, ఇలాంటి మార్కులు వస్తాయని ముందుగానే ఊహించానని ఆమె చెప్పడం కనిపించింది. అంతేకాకుండా తమ కోరియోగ్రాఫర్ సరైన కాన్సెప్ట్ ఎంచుకోలేదని ఆమె వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా కోరియోగ్రాఫర్ మాట్లాడుతూ, తమకు సరైన సమయం ఇవ్వలేదని, సమయం ఇచ్చి ఉంటే కాన్సెప్ట్ మరింత మెరుగ్గా వచ్చేదని అన్నారు. దాంతో ఈసారి రీతు, పవన్ ఎలిమినేషన్ తప్పదంటున్నారు.
రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఇక ఈ షోలో పాల్గొన్నందుకు వీరికి భారీగానే రెమ్యునరేషన్ అందినట్టు సమాచారం. ఇద్దరికీ కలిపి ఎపిసోడ్‌కు రూ.4 లక్షల వరకూ ఇచ్చారని టాక్. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. చెరో రెండు లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారట. ఐదు వారాలు కొనసాగినందున సుమారు రూ 20 లక్షల వరకు వీరు అందుకున్నట్టు తెలుస్తోంది.ఇద్దరికి ఇదే మొదటి డ్యాన్స్ షో కావడం.. అనుభవం లేకపోవడంతో.. సరిగ్గా చేయలేకపోయారట. ఇక నెక్ట్స్ టైమ్ తీసుకుంటే.. ఇరగదీస్తారంటూ.. అభిమానులు చర్చించుకుంటున్నారు.
రీతూ, పవన్ ఎలిమినేషన్ గురించి మరిన్ని వివరాలు త్వరలో మీ ముందుకు తీసుకువస్తాం. BB జోడీ 2 అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


