
📌 Key Points
- విజయ్‌తో ‘కరుప్పు’ సినిమా చేయాల్సి ఉంది, కానీ సూర్యకు కథ చెప్పడం జరిగింది.
- ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా ‘కరుప్పు’ మూవీ త్వరలో విడుదల కానుంది.
- త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో యోగి బాబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.
- విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సూర్యతో సినిమా చేసే అవకాశం వచ్చింది.
కోలీవుడ్ స్టార్ సూర్య, ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న ‘కరుప్పు’ మూవీ గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా మొదట విజయ్‌తో చేయాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల సూర్యకి వెళ్లింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విజయ్‌తో సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి?
Karuppu; కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబోలో వస్తున్న మూవీ ‘కరుప్పు’. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సూర్య ఫ్యాన్స్ అయితే ఈ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా సూర్యకు సరైన హిట్ లేదు. అందుకే, కరుప్పు సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటికే.. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, కరుప్పు సినిమా విడుదల అవుతున్న సందర్బంగా దర్శకుడు ఆర్జీ బాలాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘కరుప్పు(Karuppu) సినిమా కథను సూర్య కోసం కాకుండా తలపతి విజయ్ కోసం రాసుకున్నాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు.
సూర్య కోసం కథలో మార్పులు చేసిన బాలాజీ
‘2023లో ‘కరుప్పు’ కథా రచన ప్రారంభించినప్పుడు, స్క్రిప్ట్ స్పాన్ పెరుగుతూ వచ్చింది. అప్పుడే అనుకున్నాను ఈ కథకు భారీ స్టార్ హీరో అయితేనే న్యాయం జరుగుతుందని. అప్పుడే విజయ్‌ను కలిసి పూర్తి స్క్రిప్ట్‌ను వినిపించగా, ఆయనకు కథ బాగా నచ్చింది. షూటింగ్ వెంటనే మొదలుపెట్టగలవా? అని విజయ్ అడిగారు. ఆ సమయంలో సరైన ప్రిపరేషన్ కోసం కొంత సమయం కావాలని అడిగాను. అప్పుడే, విజయ్ రాజకీయ ప్రయాణం (TVK పార్టీ) పనుల్లో బిజీ అయిపోవడంతో మా కాంబినేషన్ కుదరలేదు.
‘కరుప్పు’ మూవీలో త్రిష పాత్ర ఎలా ఉండబోతోంది?
ఆ తరువాత, అదే కథన సూర్యకు వినిపించాగా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆయన ఇమేజ్‌కు మరియు బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా హీరో పాత్రలో కొన్ని కీలక మార్పులు చేశాం అంటూ’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో యోగి బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి చాలా ఆసక్తికర అంశాలతో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ రాబడుతుంది అనేది చూడాలి.
సూర్య ‘కరుప్పు’ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.


