
📌 Key Points
- ‘పరాశక్తి’ శివకార్తికేయన్ కెరీర్‌లో 25వ ప్రతిష్టాత్మక చిత్రం.
- దర్శకురాలు సుధా కొంగర సినిమా స్టోరీ లీక్ చేసింది.
- రాజకీయాలతో పాటు ఇద్దరు సోదరుల అనుబంధం, ప్రేమ కథ కీలకం.
- శ్రీలీల మంత్రి కుమార్తెగా, శివకార్తికేయన్ సరసన నటించనుంది.
శివకార్తికేయన్ 25వ చిత్రం ‘పరాశక్తి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమా స్టోరీ లీక్ చేస్తూ, ఇది కేవలం రాజకీయ చిత్రం కాదని, ప్రేమ, సోదర అనుబంధం, ఊహించని మలుపులు ఉంటాయని వెల్లడించారు.
దర్శకురాలి స్టోరీ లీక్: అసలు కథేంటి?
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘అమరన్’ వంటి బ్లాక్ బస్టర్ వంటి సినిమాతో బాక్సాఫీసును షేక్ చేశాడు. ఇటీవల ‘మదరాసి’తో ప్రేక్షకులను అలరించినప్పటికీ హిట్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ ‘పరాశక్తి’ (Parashakti)పనుల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుండగా.. కవి మోహన్, అథర్వ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఇది శివ కార్తికేయన్ కెరీర్‌లో 25వ ప్రాజెక్ట్‌గా రాబోతుండటం మరింత ప్రత్యేకంగా మారింది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది.
పరాశక్తిలో ప్రేమ, రాజకీయాలు
ఈక్రమంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకురాలు సుధా కొంగర ‘పరాశక్తి’ స్టోరీ లీక్ చేసింది. ‘‘పరాశక్తి కేవలం రాజకీయ చిత్రం మాత్రమే కాదు.. ఇద్దరు సోదరులైన (శివకార్తికేయన్ – అథర్వ) మధ్య అందమైన అనుబంధం గురించి చెప్పే చిత్రం కూడా. ఇందులో ప్రేమ కూడా ఉంది ఊహించని ఎలిమెంట్స్ ఉన్నాయి. శివకార్తికేయన్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. అథర్వ ఇంజనీరింగ్ చేస్తుంటాడు. కానీ వారిద్దరికీ వారి సిద్ధాంతాల విషయంలో విభేదాలు ఉంటాయి. అలాగే శ్రీలీల మంత్రి కుమార్తె పాత్రలో నటిస్తుంది. ప్రేమ కథ కూడా ఇందులో ఒక భాగం కాబోతుంది.ఈ సినిమా నేపథ్యం పూర్తిగా తమిళనాడులోని చిన్న పట్టణం చుట్టూ తిరుగుతుంది. అక్కడి రాజకీయ పరిస్థితులు, ప్రజల సమస్యలు, వాళ్ల ఆశలు ఆకాంక్షలు ఈ కథకు ముడిపడి ఉంటాయి.
శివకార్తికేయన్, శ్రీలీల పాత్రలు
శివకార్తికేయన్, అథర్వ మధ్య ఉండే భావోద్వేగ ప్రయాణం ఈ సినిమాలో చాలా హైలైట్‌గా నిలుస్తుంది. వీరిద్దరి కుటుంబాల మధ్య జరిగే సంఘర్షణలు, తండ్రి పాత్రలో కనిపించే కవి మోహన్ నిర్ణయాలు కూడా కథకు కీలకం. ఒక సమయంలో రాజకీయ నిర్ణయం ఇద్దరు సోదరులను ఎదురెదురుగా నిలబెడుతుంది. సిద్ధాంతాలు, బాధ్యతలు, ప్రేమ, కుటుంబం… ఈ నాలుగు కోణాల్లో సినిమా సాగుతుంది. శ్రీలీల – శివకార్తికేయన్ మధ్య ఉండే రొమాంటిక్ కెమిస్ట్రీ యువతను ఆకట్టుకుంటుంది. ఆమెకు సినిమా మొత్తం కీలకమైన స్కోప్ ఉంటుంది.ఈ సినిమా కోసం శివకార్తికేయన్ తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చుకున్నాడు. పాత్రలోకి పూర్తిగా దిగిపోయాడు. అథర్వ కూడా ఇదే స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సన్నివేశాలు, డ్రామా, కామెడీ అన్ని మిక్స్ చేసి మంచి ప్యాకేజ్డ్ ఎంటర్‌టైనర్‌గా తెస్తున్నాం’’ అని చెప్పుకొచ్చింది.
మొత్తంగా, దర్శకురాలి స్టోరీ లీక్ ప్రకారం ‘పరాశక్తి’ కేవలం రాజకీయ చిత్రం కాదు. భావోద్వేగపూరితమైన సోదర అనుబంధం, ప్రేమ కథలతో సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్‌టైనర్‌గా రానుంది.


