|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో రాబిన్‍హుడ్.. ప్రకటనతో క్లారిటీ

Published: 03-05-2025, 5:15 AM
ఓటీటీలో రాబిన్‍హుడ్.. ప్రకటనతో క్లారిటీ

నితిన్ మరియు శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన రాబిన్‌హుడ్ సినిమా బాక్సాఫీస్‌లో నిరాశపరిచింది. అయితే, తాజాగా వచ్చిన వార్తల ప్రకారం, ఈ సినిమా మే 10న జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.

Key Points

1

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్‌హుడ్ ఓటీటీలోకి!

2

మే 10న జీ5లో ప్రసారం, జీ తెలుగులో టీవీ ప్రీమియర్.

4

సుమారు 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 10 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది.

రాబిన్‌హుడ్ ఓటీటీ విడుదల తేదీ

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన రాబిన్‍హుడ్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ ఏడాదిలో మార్చి 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాలతో థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే, మొదటిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో అనుకున్నంత కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో నితిన్, శ్రీలీలతో పాటు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, కేతిక శర్మ మెప్పించగా.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్‌తో కనిపించారు.

రాబిన్‍హుడ్ సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్‍లో మే 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్నట్లు ఒక పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. అయితే, జీ5 ఆప్‌కమింగ్‌ సినిమాల విభాగంలో మే 10న ఓటీటీ విడుదల కానుందని ఒక ప్రకటన ఉంది.  కొద్దిరోజులుగా జీ నెట్‌వర్క్‌ ఇలాంటి స్ట్రాటజీనే అమలు చేస్తోంది. కొత్త సినిమాలను టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఒకేసారి విడుదల చేస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో కూడా ఇదే ప్లాన్‌ను జీ తెలుగు అమలు చేసింది. ఇప్పుడు రాబిన్‌హుడ్‌ చిత్రం విషయంలోనూ దానిని అమలు చేస్తున్నట్లు అర్థం అవుతుంది. మే 10 నుంచి జీ తెలుగు ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఫైనల్‌ అయింది. సుమారు రూ. 50కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 10 కోట్లు కూడా రాబట్టలేదని టాక్‌.

జీ5 మరియు జీ తెలుగు ప్రసారం

కథేంటంటే.. ‍ రామ్‌ (నితిన్‌) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్‌’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్‌(షైన్‌ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్‌ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు.

సినిమా బాక్సాఫీస్ ప్రదర్శన

రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్‌) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.(Robinhood Review).  అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్‌ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు?  సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్‌ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్‌ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

చివరగా, రాబిన్‌హుడ్ సినిమా ఓటీటీ విడుదలతో ప్రేక్షకులకు మరో అవకాశం లభించనుంది. బాక్స్ ఆఫీస్ ఫలితాలకు భిన్నంగా, ఓటీటీలో దీనికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.