
జీ తెలుగులో ప్రసారమయ్యే ‘సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్’ గ్రాండ్ ఫినాలేకి రోజా మరియు మంచు లక్ష్మి ప్రత్యేక అతిథులుగా హాజరై సందడి చేశారు. వారి మధ్య జరిగిన ప్రత్యేక సంభాషణలు, ఆటలు ప్రోమోలో చూడొచ్చు.
Key Points
రోజా మరియు మంచు లక్ష్మి 'సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్' లో సందడి చేశారు.
ఇద్దరూ స్టేజిపై పదునైన సంభాషణలతో ఆకట్టుకున్నారు.
వాటర్ బోరింగ్ గేమ్ ఆడుతూ సరదాగా గడిపారు.
ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.
రోజా మరియు మంచు లక్ష్మి టీవీ షోలో
Roja – Manchu Lakshmi : రోజా ఇటీవల మళ్ళీ టీవీ షోలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ లో జడ్జిగా అలరిస్తుంది. అలాగే సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ లో అప్పుడప్పుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తుంది. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి రోజా, మంచు లక్ష్మి వచ్చి సందడి చేసారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేసారు.
స్టేజిపై సందడి
ఈ ప్రోమోలో రోజా, మంచు లక్ష్మి ఇద్దరూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. స్టేజిపైకి వచ్చాక రోజా.. ఎండాకాలంలో ఏదైనా మంచు ప్రదేశానికి వెళ్దాం అనుకున్నా ఇక్కడికి వచ్చేసా అని మంచు లక్ష్మికి కౌంటర్ ఇవ్వగా మంచు లక్ష్మి.. పోటీలో ఎవరైనా కంచు గా ఉంటె బాగుండు అనుకున్నా మీరు కలిశారు అని రిప్లై ఇచ్చింది. ఈ ఇద్దరూ కలిసి వాటర్ బోరింగ్ కొట్టే గేమ్ సరదాగా ఆడారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.
వైరల్ ప్రోమో
మీరు కూడా రోజా, మంచు లక్ష్మి సందడి చేసిన సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోమో చూసేయండి..
రోజా మరియు మంచు లక్ష్మిల సందడితో ‘సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్’ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వైరల్ ప్రోమోని మిస్ అవ్వకండి!


