
ఓటీటీలోకి మరో కొత్త సిరీస్ వచ్చింది. ‘ది డెడ్ గర్ల్స్’ అనే మెక్సికన్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ బ్రోతెల్ హౌస్ నడిపే సిస్టర్స్ చుట్టూ తిరుగుతుంది.
Key Points
మెక్సికన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.
బ్రోతెల్ హౌస్ నడిపే సిస్టర్స్ సీరియల్ కిల్లర్స్‌గా మారడం.
ప్రభుత్వం బ్రోతెల్ సీజ్ చేసిన తర్వాత అమ్మాయిలు చనిపోవడం.
నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఆరు ఎపిసోడ్ల సిరీస్.
ది డెడ్ గర్ల్స్ సిరీస్ ఓటీటీలోకి
ఓటీటీలోకి ఫ్రెష్ కంటెంట్ వస్తూనే ఉంది. వివిధ జోనర్లలో సినిమాలు, సిరీస్ లు ఆడియన్స్ ను అలరిస్తూనే ఉన్నాయి. బోల్డ్, రొమాంటిక్, ఎరోటిక్ కంటెంట్ కూడా కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతోంది. ఇప్పుడు ఇలాంటి రొమాంటిక్ లోనే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా ఓ సిరీస్ వచ్చింది. ఇవాళ ‘ది డెడ్ గర్ల్స్’ సిరీస్ ఓటీటీలో అడుగుపెట్టింది.
రొమాంటిక్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘ది డెడ్ గర్ల్స్’ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మెక్సికన్ డ్రామా ఇవాళ (సెప్టెంబర్ 10) ఓటీటీ లోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గా రూపొందిన ఈ థ్రిల్లర్ ఆ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే అడుగుపెట్టింది. ఈ సిరీస్ లోని ఆరు ఎపిసోడ్లు ఒకేసారి రిలీజ్ అయ్యాయి.
బ్రోతెల్ హౌస్ మరియు సీరియల్ కిల్లింగ్స్
1960 కాలంలో మెక్సికో బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ సాగుతోంది. బలాడ్రో సిస్టర్స్ ఇద్దరు కలిసి పెద్ద వ్యభిచార గృహాన్ని (బ్రోతల్ హౌస్) ఏర్పాటు చేస్తారు. అమ్మాయిలను ఆట బొమ్మల్లాగా మార్చి వేశ్యల సామ్రాజ్యాన్ని శాసిస్తుంటారు. డబ్బుల కోసం గర్ల్ ను ఎలా కావాలంటే అలా వాడుకుంటారు. కానీ ఈ సిస్టర్స్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ బ్రోతల్ హౌస్ ను సీజ్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడి అమ్మాయిలు వరుసగా చనిపోతుంటారు. బలాడ్రో సిస్టర్స్ పారిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ హత్యలు చేసింది ఎవరు? అనేది మిస్టరీగా మారింది. ఈ రహస్యం వీడాలంటే ది డెడ్ గర్ల్స్ సిరీస్ చూడాల్సిందే.
రొమాంటిక్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ది డెడ్ గర్ల్స్ లో ఆరు ఎపిసోడ్లే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించేదే. అయితే ఇటీవల ఓ సీజన్ లో పార్ట్ 2ను కూడా తీసుకొస్తున్న నెట్‌ఫ్లిక్స్.. ఇప్పుడు ది డెడ్ గర్ల్స్ సీజన్ లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సమచారం ప్రకారం ది డెడ్ గర్ల్స్ సీజన్ 1లోనే పార్ట్ 2 కూడా వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ మెక్సికన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ది డెడ్ గర్ల్స్ సిరీస్ హిందీలోనూ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ తో పాటు హిందీలోనూ ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో పౌలీనా గైతన్, అర్సెలియా రమిరెజ్, జొయాక్విన్ కోసియో, ఆల్పోన్సో హెరెరా, మారిసియో తదితరులు నటించారు. సస్పెన్స్, మిస్టరీతో సాగే రొమాంటిక్ సిరీస్ కావాలంటే ది డెడ్ గర్ల్స్ పై ఓ లుక్కేయండి.
‘ది డెడ్ గర్ల్స్’ సిరీస్‌లోని సస్పెన్స్, మిస్టరీ అంశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ చూసి మిస్టరీని ఛేదించండి.


