|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Surya’s ‘Retro’: అప్పుడే ఓటీటీలోకి రెట్రో.. నిరుత్సాహంలో సూర్య ఫ్యాన్స్

Published: 14-05-2025, 12:36 PM
Surya's 'Retro': అప్పుడే ఓటీటీలోకి రెట్రో.. నిరుత్సాహంలో సూర్య ఫ్యాన్స్

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా థియేటర్లలో అనుకున్నంత విజయం సాధించలేదు. రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రకటించడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Key Points

1

సూర్య 'రెట్రో' సినిమా థియేటర్లలో అనుకున్నంత ఆదరణ పొందలేదు.

2

రిలీజ్ అయిన కేవలం 15 రోజులకే సినిమా ఓటీటీలోకి రాబోతోంది.

4

సినిమా ఓటీటీ రిలీజ్‌తో సూర్య అభిమానులు నిరాశ చెందుతున్నారు.

‘రెట్రో’ సినిమా బాక్సాఫీస్ ప్రదర్శన

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya) రీసెంట్‌గా ‘రెట్రో’ (Retro) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. రిలీజ్‌కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. ఆడియన్స్‌లో ‘రెట్రో’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. దీంతో.. ఎన్నో అంచనాల మధ్య మే 1న థియేటర్స్‌లోకి వచ్చింది. కానీ అనుకున్నంతగా క్రేజ్ తెచ్చుకోలేక పోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే థియేటర్‌లో రిలీజైనా కేవలం 15 రోజులకే ఈ సినిమా ఓటీటీ (OTT) అప్‌డేట్ వచ్చేసింది. ‘రెట్రో’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా.. స్ట్రీమింగ్‌పై అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు ‘తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో రెట్రో త్వరలో ఓటీటీలోకి రాబోతుంది’ అంటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. అయితే.. రిలీజ్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. కేవలం 15 రోజులకే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం కావడంతో సూర్య ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ విడుదల ప్రకటన

సూర్య అభిమానుల నిరాశ

చిన్న వ్యవధిలోనే ‘రెట్రో’ ఓటీటీకి వెళ్లడం సూర్య అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. సినిమా విజయవంతం కాలేదని దీనితో స్పష్టమవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.