
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘ఛాంపియన్’ సినిమాతో తిరిగి వెండితెరపైకి వస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ నేపథ్య చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. రోషన్ మేకోవర్, మూవీ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Key Points
నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రోషన్ 'ఛాంపియన్' సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నాడు.
ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమా నిర్మిస్తోంది.
స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రోషన్ కొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు.
'ఛాంపియన్' సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు.
ఛాంపియన్: చిత్ర వివరాలు, నిర్మాణ సంస్థలు
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan) హీరోగా ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఛాంపియన్’ (Champion). సుమారు నాలుగేళ్ల తర్వాత రోషన్ మళ్లీ వెండితెరపైకి రానున్నాడు. ఈ క్రమంలో ఛాంపియన్ విడుదల పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమాపై రోషన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. సుమారు 50కి పైగా కథలను రిజెక్ట్ చేసి ఫైనల్‌గా ఈ స్టోరీని ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆపై ఈ చిత్రాన్ని స్వప్న దత్ నిర్మిస్తుండంతో అంచనాలు బాగానే ఉన్నాయి.
పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఛాంపియన్ సినిమాను క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ నెటిజన్లను కూడా మెప్పించింది. ఇందులో రోషన్ లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ కోసం రోషన్ మేకోవర్ చాలా కొత్తగా ఉండటంతో ఈసారి భారీ హిట్ కొడతాడని నెటిజన్లు కూడా అభిప్రాయం చెందుతున్నారు.
రోషన్ కష్టం, ఆశలు: 50 కథల రిజెక్షన్
విడుదల తేదీ, అంచనాలు: క్రిస్మస్ కానుకగా
‘ఛాంపియన్’ సినిమాతో రోషన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై రోషన్, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.


