|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రౌడీ హీరో పుట్టినరోజు: అభిమానుల మధ్య కేక్ కట్, వైరల్ అవుతున్న వీడియోలు!

Published: 09-05-2026, 8:46 AM
రౌడీ హీరో పుట్టినరోజు: అభిమానుల మధ్య కేక్ కట్, వైరల్ అవుతున్న వీడియోలు!
  • విజయ్ దేవరకొండ 37వ పుట్టినరోజును మే 9న ఘనంగా జరుపుకున్నారు.
  • అభిమానులు తెచ్చిన రణబాలి థీమ్ కేక్‌ను స్వయంగా కట్ చేశారు.
  • ఇంటి వద్దకు వచ్చిన ఫ్యాన్స్‌తో బాల్కనీ నుంచి ముచ్చటించి, ధన్యవాదాలు తెలిపారు.
  • ప్రస్తుతం రౌడీ జనార్ధన్, రణబాలి చిత్రాల్లో నటిస్తున్నారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మే 9న తన 37వ పుట్టినరోజును అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఇంటి వద్దకు వచ్చిన వేలాది మంది ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసి, వారితో ముచ్చటించారు. ఈ అరుదైన సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అభిమానుల మధ్య విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు

Vijay Devarakonda:  విజయ్ దేవరకొండ నేడు (మే 9) న పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈయన తన 37వ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ పుట్టినరోజు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కు ఎంతో స్పెషల్ అని చెప్పాలి. పెళ్లి తర్వాత విజయ్ రష్మిక(Rashmika)తో జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావటం విశేషం. విజయ్ దేవరకొండ పుట్టినరోజు(Birthday) సందర్భంగా సినిమా సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

ఇక విజయ్ నటిస్తున్న సినిమాల నుంచి కూడా స్పెషల్ పోస్టర్స్ తో పాటు వీడియోలను కూడా విడుదల చేస్తూ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. ఇకపోతే విజయ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకొని రౌడీ హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక రష్మిక విజయ్ సైతం అభిమానులతో ఇంటి బాల్కనీ నుంచి ముచ్చటిస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అయితే విజయ్ కోసం అభిమానులు స్పెషల్ గా రణబాలి థీమ్ తో కేక్ తయారుచేసి తీసుకురావడంతో విజయ్ నేరుగా అభిమానుల వద్దకు వెళ్లి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

కేక్ కట్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన రౌడీ హీరో

ఇలా తన ఇంటి గేటు ముందు అభిమానులు పెద్ద ఎత్తున హంగామా చేస్తున్న నేపథ్యంలో విజయ్ స్వయంగా వారి వద్దకు వెళ్లి వారు తీసుకువచ్చిన కేక్ కట్ చేసి అభిమానుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా హీరోలు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఏ హీరో కూడా అంత సాహసం చేయరు.

ఇక విజయ్ దేవరకొండను చూడటం కోసం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఫాన్స్ కోరిక మేరకు విజయ్ స్వయంగా వారి వద్దకు వెళ్లి కేక్ కట్ చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన రౌడీ జనార్ధన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రణబాలి అనే సినిమాలో కూడా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ పాత్రలో నటించడం విశేషం. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ఈయన మరో డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ఇటీవల అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాలు, రష్మికతో పెళ్లి ప్రస్తావన

సాధారణంగా హీరోలు ఇలా అభిమానుల మధ్య కేక్ కట్ చేయడం అరుదు. విజయ్ దేవరకొండ చేసిన ఈ పని అభిమానులను ఎంతగానో సంతోషపరిచింది. ఇది ఆయనకు, అభిమానులకు మర్చిపోలేని పుట్టినరోజు వేడుకగా నిలిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.