
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’లో నటిస్తున్నారు.
- ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
- కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
- రాజశేఖర్ గతంలో పలు సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా ఉన్నారు.
విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
రౌడీ జనార్ధన్‌లో రాజశేఖర్ ఎంట్రీ?
Rowdy Janardhan: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం లేని నేపథ్యంలో మంచి సక్సెస్ కోసం ఎంతో తాపత్రయపడుతున్నారు. ఇటీవల కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండకు ఆశించిన స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అందించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఈయన తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం ఈయన రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రణబాలి అనే సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా రవికిరణ్ కోలా డైరెక్షన్లో రౌడీ జనార్దన్ (Rowdy Jabardhan)అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఇకపోతే తాజాగా రౌడీ జనార్ధన్ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు మరొక సీనియర్ హీరో కూడా నటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు బయటకు వచ్చాయి. ఈ రౌడీ జనార్ధన్ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ (Rajasekhar)ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.. అయితే ఆయన పాత్ర ఏంటి అనే విషయాన్ని గురించి సరైన స్పష్టత లేదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాజశేఖర్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కీలక పాత్రలో రాజశేఖర్.. వివరాలు
ఇటీవల రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈయన శర్వానంద్ హీరోగా నటిస్తున్న బైకర్ సినిమాలో సునీల్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు బలగం వేణు డైరెక్షన్లో దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ సినిమాలో కూడా దేవి శ్రీ ప్రసాద్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఈయన నటించబోతున్నారంటూ వార్తలు రావడం విశేషం.
హీరోయిన్ గా కీర్తి సురేష్..
విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్
ఈ సినిమాలో రాజశేఖర్ నటించబోతున్నట్లు వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జోడిగా నటి కీర్తి సురేష్(Keerthy Suresh) నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా విజయ్ మంచి సక్సెస్ అందుకుంటారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రాజశేఖర్ ఈ చిత్రంలో నటిస్తున్న విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్త నిజమైతే, విజయ్ దేవరకొండ, రాజశేఖర్ కలిసి స్క్రీన్ పంచుకోవడం చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


