
ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. చిన్న కథతో వచ్చి పెద్ద హిట్ అవుతున్నాయి సినిమాలు. ఇందులో క్రైమ్, ఫన్నీ, ఫ్యామిలీ జోనర్ నేపథ్యంలో సినిమాలు వచ్చి సక్సెస్ కూడా అవుతున్నాయి. అయితే అలా లేటెస్ట్ గా హిట్ అయిన సినిమా వాజా 2 : బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్. ఇది మలయాళంలో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. కేవలం రూ. 10 కోట్లతోనే ఈ సినిమాను తీశారు.
రిలీజ్ అయిన 17 రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. స్కూల్లో అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు కుర్రాళ్ళు.. జీవితంలో ఎలా సెటిలర్ అయ్యారు అన్నది ఈ సినిమా కథ. రియాలిటీకి కథ దగ్గరగా ఉన్న నేపథ్యంలో జనాలకు బాగా ఎక్కింది. ఈ నేపథ్యంలోనే కలెక్షన్స్ కూడా రాబడుతోంది. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. వాలా 2 ( Vaazha 2) పేరుతో ఈనెల 24వ తేదీన రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు గత రాసింది విపిన్ దాస్. దర్శకత్వం వహించింది సవిన్ షా. ప్రొడ్యూసర్లుగా సాహు గారపాటి, విపిన్ దాస్, హరీస్ దేశం, ఆదర్శ్, నిర్మాతలుగా వ్యవహరించారు.


