
📌 Key Points
- రుక్మిణి వసంత్ బికినీ వీడియోపై సోషల్ మీడియాలో భారీ దుమారం.
- AI సృష్టించిన నకిలీ వీడియో అంటూ హీరోయిన్ షాకింగ్ క్లారిటీ.
- గోప్యత ఉల్లంఘనపై రుక్మిణి తీవ్ర ఖండన, లీగల్ చర్యలకు సిద్ధం.
- అభిమానులకు ఊరట, నకిలీ కంటెంట్ షేర్ చేయవద్దని విజ్ఞప్తి.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరు ఇప్పుడు నెట్టింట మారుమోగిపోతోంది. బికినీ వీడియో వివాదం, AI మాయాజాలం.. ఈ అంశాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అసలు ఏం జరిగింది? హీరోయిన్ ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం!
రుక్మిణి బికినీ వీడియో: నిజమా? అబద్ధమా?
‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే.. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ ఈ అమ్మడుకి సరైన హిట్ పడలేదు. ప్రస్తుతం రుక్మిణి వసంత్ తన ఆశలన్ని ఎన్టీఆర్ ‘డ్రాగన్’ పైనే పెట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి సంబంధించిన బికినీ వీడియో క్లిప్స్, ఫొటోస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాల్లో హిట్స్ లేక సోషల్ మీడియాలో ఇలాంటి పనులు చేస్తుందా అంటూ నెట్టింట ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే నెట్టింట వైరల్‌గా మారిన బికినీ వీడియోపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది రుక్మిణి.
‘నేను అని చెప్పుకుంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం అవుతున్న కొన్ని AI-సృష్టించిన వీడియోలు, ఫొటోలు నా బృందం అండ్ నేను గమనించాము. ఈ చిత్రాలు పూర్తిగా నకిలీవి.. అలాగే కల్పితమైనవని నేను స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఇలాంటి తారుమారు చేయబడిన కంటెంట్‌ను సృష్టించడం, ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం అండ్ గోప్యత యొక్క తీవ్రమైన ఉల్లంఘన. మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ చిత్రాలను సృష్టించి, వ్యాప్తి చేయడంలో పాలుపడిన వారిపై అవసరమైన చట్టపరమైన, అండ్ సైబర్‌క్రైమ్ చర్యలను ప్రారంభిస్తున్నాము. ప్రతిఒక్కరూ ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేయడం, లేదా దాని గురించి మాట్లాడుకోవడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నాము’ అంటూ నోట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో.. ఆ బికినీ వీడియో తనది కాదని తెలుసుకున్న అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
AI మాయాజాలంపై హీరోయిన్ సంచలన స్పందన
లీగల్ యాక్షన్: రుక్మిణి సీరియస్ వార్నింగ్
రుక్మిణి వసంత్ బికినీ వీడియోపై చెలరేగిన వివాదానికి తాజా స్పందనతో తెరపడింది. ఈ సంచలన ఘటనపై మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!


