|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ రాజకీయ విజయం: తెలుగు హీరోలకు ఆ కల సాకారం అవుతుందా?

Published: 13-07-2026, 1:57 AM
విజయ్ రాజకీయ విజయం: తెలుగు హీరోలకు ఆ కల సాకారం అవుతుందా?

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో సంప్రదాయ పార్టీలు విఫలమవడంతో, సినీ హీరోలు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. తమిళ హీరో విజయ్ రాజకీయ విజయం వీరికి స్ఫూర్తినిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Key Points

1

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశంపై యువతలో తీవ్ర చర్చ.

2

సంప్రదాయ పార్టీలపై అసంతృప్తితో సినీ హీరోల వైపు యువత ఆశలు.

4

తమిళ హీరో విజయ్ రాజకీయ విజయం తెలుగు హీరోలకు స్ఫూర్తి.

జూనియర్ ఎన్టీఆర్, బన్నీ రాజకీయ ప్రవేశంపై చర్చ

ఏ నలుగురు కుర్రోళ్లు ఒక చోట చేరినా.. జూనియర్​ ఎన్టీఆర్​ కొత్త పార్టీ పెడుతున్నారనే దానిపైనే ఎడతెగని చర్చలు.. తెలంగాణలో బన్నీ పార్టీ పెడితే విజయం గ్యారంటీ.. అంటూ ఒకటే వాదోపవాదాలు. ఇంతగా ఈ ఇద్దరు సినీ స్టార్స్​యువతను ఊరిస్తున్నారు. ఇవన్నీ ఊహాగానాలేనంటూ ప్రముఖ పార్టీల అనుచరులు కొట్టిపారేస్తున్నారు. సంప్రదాయ రాజకీయ పార్టీలు యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమవుతున్నందునే ఈ సినీ హీరోలు రాజకీయాలవైపు రావాలని కోరుకుంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జెన్​జీ తరాన్ని ఒడిసి పట్టేందుకు ఈ ఇద్దరు నటులు రాజకీయ అరంగేట్రం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని సర్వత్రా వినిపిస్తోంది.

ఈ నెల18 తర్వాత రాష్ట్రంలో జూనియర్​ ఎన్టీఆర్​ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. ఆయన అనుచరులు కూడా స్పష్టతనివ్వలేదు. జూనియర్ అభిమానుల్లో మాత్రం చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. తొలుత సేవా కార్యక్రమాలతో ఓ ఏడాదిపాటు అభిమాన సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశముందంటున్నారు. నిరుద్యోగం, వివక్ష కారణంగా యువతలో నెలకొన్న నిరాశా నిస్పృహలే అస్త్రాలుగా జూనియర్​ ఎన్టీఆర్​ కొత్త పార్టీని ప్రకటించే అవకాశముందని అభిమానుల్లో ప్రచారం ఊపందుకుంది.

యువత ఆకాంక్షలు, సంప్రదాయ పార్టీలపై అసంతృప్తి

మరోవైపు తెలంగాణలో బన్నీ కొత్త పార్టీ గురించి యువతలో చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్​ రెడ్డి బన్నీ విషయంలో అతిగా స్పందించారని ప్రధానంగా ఆయన అభిమానుల నుంచి వినిపిస్తోంది. తెలంగాణ అల్లుడు కావడంతోపాటు సినీ ఫేమ్​ అల్లు అర్జున్‌కు కలిసొచ్చే అంశాలని యువత భావిస్తోంది. త్వరలో రాజకీయాల్లోకి అడుగు పెట్టే విధంగా బన్నీ సినిమాలు ఉండొచ్చని అభిమానులు చెబుతున్నారు. మెగాస్టార్, పవర్​స్టార్‌కు భిన్నంగా బన్నీ పార్టీ ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.

విజయ్ విజయం: తెలుగు హీరోలకు ఆదర్శమా?

జూనియర్, బన్నీ సరికొత్త విధానాలతో యువత ఆశలకు ఊపిరిపోసేట్లుంటే తమిళనాట టీవీకే అధినేత విజయ్​ మాదిరిగా విజయం సాధించవచ్చని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఎన్డీయే, కాంగ్రెస్ పక్షాలను జెన్​జీ తరం ఈసడించుకుంటున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగం, విద్య, ఉపాధి అవకాశాల్లో వివక్ష, అవినీతిపై జాతీయ స్థాయిలో జెన్​జీ యువత ఢిల్లీలో కాక్రోచ్​ పార్టీ పేరుతో శాంతియుత ఆందోళనకు దిగింది. అధికారులు, రాజకీయ నేతల కుటుంబాలకు ఇంత పెద్ద ఎత్తున సంపద ఎలా కూడుతుందనే ఆలోచనలు యువత మెదళ్లను తొలిచేస్తోంది. యువత ఆక్రోశాన్ని అధికార ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదనే భావన నెలకొంది. ఈ అంశాలే సదరు ఇద్దరు నటులను రాజకీయాలవైపు పురికొల్పాయా..! ఒకవేళ కొత్త పార్టీలతో రంగంలోకి దిగితే సంప్రదాయ పార్టీలను ఎదుర్కోగలవా! సరికొత్త నినాదాలతో రాజకీయాల్లోకి అడుగు పెడితే.. ఎలా ఉంటుందనే స్పందన కోసం జనంలోకి ప్రచారాలు వదులుతున్నారా! ఏదైనా మరికొద్ది రోజులు గడిస్తే కొంత స్పష్టత రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మొత్తంగా, తెలుగు సినీ హీరోలు రాజకీయాల్లోకి వస్తే, యువత ఆశలకు ఊపిరిపోసి, తమిళ హీరో విజయ్ తరహాలో విజయం సాధిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.