
📌 Key Points
- రుక్మిణి వసంత్, సిద్ధాంత్ నాగ్‌తో డేటింగ్ రూమర్లపై ఆమె టీమ్ స్పష్టతనిచ్చింది.
- రుక్మిణి, సిద్ధాంత్ మంచి స్నేహితులని, డేటింగ్ వార్తల్లో నిజం లేదని తెలిపారు.
- వైరల్ అవుతున్న ఫోటో 2023 నాటిదని, దానిని ఇప్పుడు తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
- రుక్మిణి ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
రుక్మిణి వసంత్ డేటింగ్ రూమర్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సిద్ధాంత్ నాగ్‌తో ఆమె రిలేషన్‌షిప్ గురించి వస్తున్న వార్తలపై ఆమె టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో నిజం ఎంతవరకు ఉందో తెలుసుకుందాం.
రుక్మిణి వసంత్ డేటింగ్ రూమర్ల వెనుక నిజమెంత?
Rukmini Vasanth: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వినపడుతుంటాయి. ఆ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది, లేదనే విషయాలు పక్కన పెడితే నిత్యం ఎన్నో రకాల రూమర్ల ద్వారా సెలబ్రిటీలు వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటి రుక్మిణి వసంత్ సైతం డేటింగ్ రూమర్ల ద్వారా రెండు రోజులుగా సోషల్ మీడియా వార్తలలో నిలిచారు. రుక్మిణి వసంత్(Rukmini Vasanth) ప్రస్తుతం సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రుక్మిణి వసంత్ ఇటీవల సిద్ధాంత్ నాగ్(Siddanth Nag) అనే వ్యక్తితో చాలా చనువుగా ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి రుక్మిణి వసంత్ కూడా రిలేషన్ లో ఉందా? అంటూ ఈ ఫోటో పై ఆమె అభిమానులు స్పందిస్తూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతుంది. ఇలా రుక్మిణి వసంత్ డేటింగ్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై ఆమె టీం స్పందించారు. రుక్మిణి వసంత్ సిద్ధాంత్ నాగ్ గురించి వస్తున్న డేటింగ్ వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.
సిద్ధాంత్ నాగ్‌తో రుక్మిణి స్నేహం గురించిన వాస్తవాలు
రుక్మిణి సిద్ధాంత్ ఇద్దరు మంచి స్నేహితులని తెలుస్తుంది .ఆయన ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నట్టు సమాచారం. ఇకపోతే రుక్మిణి సిద్ధాంత్ తో కలిసి దిగిన ఈ ఫోటో 2023వ సంవత్సరానికి సంబంధించినదని తెలుస్తోంది .అయితే అప్పటి ఫోటోని ఇప్పుడు వైరల్ చేస్తూ ఈమె డేటింగ్ లో ఉన్నారనే వార్తలను తెరపైకి తీసుకురావడంతో ఈ వార్తలకు పులి స్టాప్ పెట్టేశారు. దీంతో ఈ వార్తలలో నిజం లేదని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రుక్మిణి వసంత్ విషయానికి వస్తే..
ఈమె సప్త సాగరాలు దాటి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే పర్వాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార చాప్టర్ 1 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో రుక్మిణి పేరు కూడా మారుమోగుతుంది. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలలో కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో పాటు యష్ టాక్సిక్ సినిమాలో కూడా రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈమె ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా అవకాశాన్ని అందుకున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు.
వైరల్ ఫోటో వెనుక అసలు కథ
రుక్మిణి వసంత్ డేటింగ్ రూమర్లకు ఆమె టీమ్ పుల్ స్టాప్ పెట్టింది. ఆమె ప్రస్తుతం తన కెరీర్‌పై దృష్టి సారించిందని, వదంతులు నమ్మవద్దని కోరుతున్నారు.


