
📌 Key Points
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో రుక్మిణి వసంత్ కీలక పాత్ర పోషిస్తోంది.
- తన కెరీర్‌లో ‘డ్రాగన్’ చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని రుక్మిణి వసంత్ వెల్లడించింది.
- ‘కాంతార: చాప్టర్1’ విజయం తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది.
- యష్ ‘టాక్సిక్’ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు వేచి ఉండాలని కోరింది.
ప్రస్తుతం యువతలో క్రేజీ హీరోయిన్‌గా మారిన రుక్మిణి వసంత్, ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని ఆమె పేర్కొంది. ‘కాంతార’ విజయంతో దూసుకుపోతున్న రుక్మిణి, తన తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు పెంచుతోంది.
ఎన్టీఆర్ ‘డ్రాగన్’పై రుక్మిణి వసంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో ఊహించని ఫాలోయింగ్ రాబట్టుకుని క్రేజీ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఒక్క ప్రాజెక్ట్‌తోనే తనకంటూ ప్రత్యేక ఫేమ్ రాబట్టుకున్న యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth). తెలుగు, తమిళ, కన్నడ మలయాల భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ హిట్ తన ఖాతాలో వేసుకుంటుంది. ఇటీవల ‘కాంతార: చాప్టర్1’ మూవీతో వచ్చిన ఈ భామ సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) సరసన ‘డ్రాగన్’(Dragon)మూవీలో నటించనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా, రుక్మిణి వసంత్ హీరో యష్ ‘టాక్సిక్’లోనూ కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు విషయాలు పంచుకుంది. ప్రస్తుతం నేను ఎన్టీఆర్ గారి ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ లో నటిస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా ఉండబోతోందని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి పవర్‌ఫుల్ స్టార్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా గర్వంగా, ఆనందంగా అనిపిస్తుందని చెప్పింది. ఇందులో నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండబోతుందని, ప్రేక్షకులు తప్పకుండా నన్ను కొత్త కోణంలో చూస్తారని ఆశిస్తున్నానని అంచనాలు పెంచింది.
కెరీర్‌లో ‘డ్రాగన్’ ఎందుకు ప్రత్యేకం?
అలాగే తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి చెప్తూ.. ఇతర సినిమాల గురించి వివరాలు వెల్లడించలేను. ముఖ్యంగా ‘టాక్సిక్’ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. కానీ మేకర్స్ నిర్ణయం ప్రకారం, నేను ఏమీ చెప్పకూడదు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు అధికారికంగా అన్ని విషయాలు తెలియజేస్తాం. ఆ వరకు కొంచెం ఓపిక పట్టాలని కోరింది. త్వరలోనే నా రాబోయే సినిమాల గురించి పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాను. మీ ప్రేమ, మద్దతే నాకు అతిపెద్ద బలమని పేర్కొంది.
A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth)
‘టాక్సిక్’ అప్‌డేట్స్.. అభిమానులకు రుక్మిణి విజ్ఞప్తి
Related News : శివాజీ గారు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ వాడిన భాష చండాలం.. సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
రుక్మిణి వసంత్ వ్యాఖ్యలు ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఎన్టీఆర్‌తో కలిసి ఆమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో, అలాగే ‘టాక్సిక్’తో సహా ఆమె రాబోయే ప్రాజెక్ట్‌లు ఎలా ఉంటాయో చూడాలి.

