
నటి రుక్మిణి వసంత్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని ఆమె ట్విట్టర్ పోస్ట్ ద్వారా అభిమానులను హెచ్చరించింది. తన పేరుతో మోసాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. 9445893273 అనే నంబర్ తనది కాదని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Key Points
నటి రుక్మిణి వసంత్ పేరుతో మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
9445893273 నంబర్ తనది కాదని, దాని ద్వారా వచ్చే కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచన.
ఇలాంటి మోసాలు సైబర్ నేరంగా పరిగణించబడతాయి, చర్యలు తప్పవని రుక్మిణి హెచ్చరించింది.
స్పష్టత కోసం నేరుగా రుక్మిణి లేదా ఆమె టీమ్‌ను సంప్రదించమని అభిమానులకు అభ్యర్థన.
రుక్మిణి వసంత్ పేరుతో మోసాలు
క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ట్విట్టర్ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతనిపై చర్యలు తీసుకుంటానంటూ పెట్టిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎంతోమంది ఇతరుల పేర్లను ఉపయోగించి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ళు రుక్మిణి పేరుతో కూడా మోసాలు చేస్తున్నారట. ఈ విషయం తన అభిమానులను హెచ్చరించింది. ఈ మేరకు.. ‘‘కొద్ది రోజులుగా నా పేరు మీద కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది.
నకిలీ ఫోన్ నంబర్, రుక్మిణి హెచ్చరిక
9445893273ఈ నెంబర్ ఉపయోగిస్తూ ఒక వ్యక్తి అచ్చం నాలాగే మాట్లాడుతూ.. ఇతరులను సంప్రదించినట్లు నా దృష్టికి వచ్చింది. ఈ నెంబర్ నాది కాదని నేను అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ లేదా మెసేజ్‌లు, ఫోన్ కాల్‌కు స్పందించవద్దు. ఇలా ఒకరి పేరును ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడటం సైబర్ నేరం అవుతుంది. ఇలాంటి మోసపూరిత, తప్పుదారి పట్టించే కార్యకలాపాలలో పాల్గొన్న వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోబడతాయి.
సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు
ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ లేదా మెసేజ్ వస్తే స్పష్టత కోసం మీరు నేరుగా నన్ను లేదా నా టీమ్‌ను సంప్రదించవచ్చు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండండి. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
రుక్మిణి వసంత్ చేసిన ఈ హెచ్చరిక అభిమానులందరికీ కనువిప్పు కలిగించింది. ఇటువంటి ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తుంది.


