
తమిళంలో విజయవంతమైన కామెడీ చిత్రం బన్ బటర్ జామ్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు.
Key Points
తమిళంలో సూపర్ హిట్ అయిన బన్ బటర్ జామ్ తెలుగులో విడుదల
ఆగస్టు 8న థియేటర్లలో సందడి చేయబోతున్న కామెడీ ఎంటర్‌టైనర్
మెహర్ రమేష్ టీజర్ విడుదల చేసి సినిమాకు శుభాకాంక్షలు తెలిపారు
హాస్యం, ప్రేమ, ఉత్కంఠతో కూడిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది
బన్ బటర్ జామ్ తెలుగులో విడుదల
రాజు జెయమోహన్ హీరోగా ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరోయిన్లుగా తెరకెక్కిన కామెడీ చిత్రం బన్ బటర్ జామ్. ఈ సినిమాకు రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వం వహించారు. సురేష్ సుబ్రమణియన్ సమర్పకుడిగా రూపొందిన బన్ బటర్ జామ్ సినిమాను రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేష్ సుబ్రమణియన్ నిర్మించారు.
ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఔట్ అండ్ ఔట్ కామెడీగా తెరకెక్కిన బన్ బటర్ జామ్ తమిళం లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో విడుదల చేస్తున్నారు. బన్ బటర్ జామ్ సినిమాను ఆగస్టు 8న థియేటర్లలో తెలుగు భాషలో విడుదల చేయనున్నారు.
శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సిహెచ్ సతీష్ కుమార్ ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం (జూలై 31) బన్ బటర్ జామ్ టీజర్‌ను టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ విడుదల చేశారు.
మెహర్ రమేష్ చేత టీజర్ విడుదల
ఈ సందర్భంగా బన్ బటర్ జామ్ సినిమా పెద్ద సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు భోళా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్. ఇకపోతే, ‘బన్ బటర్ జామ్’ టీజర్‌ను గమనిస్తే తల్లిదండ్రులైన చార్లి, శరణ్య పొన్‌వన్నన్ తమ కొడుకు గొప్పతనం గురించి మరొకరితో ఫోన్‌లో చెబుతుంటారు.
మరో వైపు హీరో క్యారెక్టర్‌ను ఫన్నీగా ప్రజెంట్ చేశారు. అలాగే హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్‌ను కూడా ఎంటర్‌టైనింగ్ వేలోనే చూపించటం ఆకట్టుకుంది. సునిశితమైన ఎమోషన్, అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో బన్ బటర్ జామ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టమవుతోంది.
ఇక బన్ బటర్ జామ్ టీజర్ చివర్లో టెన్షన్‌తో హీరో దగ్గరున్న సిగరెట్ తీసుకుని హీరోయిన్ తాగడం, అది చూసి షాక్ అయిన హీరో అన్ని అలవాట్లు ఉన్నాయా అని ప్రశ్నిచడం హైలెట్‌గా నిలిచింది. నిమిషం 22 సెకన్లు ఉన్న బన్ బటర్ జామ్ టీజర్ నవ్వించేలా ఉంది.
ఆగస్టు 8న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు
డైరెక్టర్ రాఘవ్ మిర్‌దత్ ఫన్నీగా ఈ సినిమాను తెరకెక్కించిన తీరు, నివాస్ కె.ప్రసన్న సంగీతం, బాబు కుమార్ సినిమాటోగ్రఫీతో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఆగస్ట్ 8న రిలీజ్ కానున్న బన్ బటర్ జామ్ సినిమాలో రాజు జెయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖతోపాటు, చార్లి, శరణ్య పొన్‌వన్నన్, దేవదర్శిని, మైకేల్ తంగదురై, విజె.పప్పు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
బన్ బటర్ జామ్ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు మంచి స్పందన లభించే అవకాశాలున్నాయి. హాస్య ప్రధానమైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడం ఖాయం.


