
📌 Key Points
- రష్యా డెడ్ హ్యాండ్ ఒక స్వయంచాలక అణు ప్రతీకార వ్యవస్థ.
- దేశ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయినా శత్రువును నాశనం చేసేలా రూపొందించబడింది.
- అణు దాడి జరిగినట్లు సెన్సార్లు నిర్ధారిస్తే వ్యవస్థ స్వయంచాలకంగా యాక్టివేట్ అవుతుంది.
- కమాండ్ రాకెట్లు ఎన్‌క్రిప్టెడ్ సిగ్నల్స్ పంపి అణు క్షిపణులను ప్రయోగిస్తాయి.
రష్యా ‘డెడ్ హ్యాండ్’ అనేది ఒక రహస్యమైన అణు ప్రతీకార వ్యవస్థ. ఇది శత్రువు దేశ నాయకత్వాన్ని నాశనం చేసినా, స్వయంచాలకంగా ప్రతిదాడి చేసేలా రూపొందించబడింది. ఈ వ్యవస్థ ప్రపంచ భద్రతకు సవాలుగా నిలుస్తుంది.
డెడ్ హ్యాండ్: మృత్యువుతో రష్యా ప్రతీకారం
రష్యా మీద అమెరికా దాడి చేయకపోవడానికి ఏకైక కారణం.. రష్యాకు చెందిన సమాధి నుండి శత్రువును వేటాడే రష్యా డెడ్ హ్యాండ్ మృత్యు యంత్రం. దీనిని అధికారికంగా పెరిమీటర్ అని పిలుస్తారు, ఇది సోవియట్ యూనియన్ కాలంలో అభివృద్ధి చేయబడిన ఒక స్వయంచాలక అణు ప్రతీకార వ్యవస్థ.
ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన. శక్తివంతమైన అణు ప్రతీకార వ్యవస్థ. దేశ నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయినా. శత్రువును నాశనం చేసేలా దీనిని రూపొందించారు…
ఒక్కసారి ఊహించుకోండి, దేశ రాజధాని అగ్నిగుండమైంది. సైనిక ప్రధాన కార్యాలయం ధ్వంసమైంది. దేశాన్ని నడిపించే అధ్యక్షుడు, వ్యూహాలు రచించే జనరల్స్ ఇలా అందరూ ఒక్క క్షణంలో కనుమరుగయ్యారు.. శత్రువు తన అణు దాడితో దేశ నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు.. (దీనిని రక్షణ పరిభాషలో డెకాపిటేషన్ స్ట్రైక్ అంటారు) అంటే తల నరకడం. తల లేని శరీరం ఎలాగూ పని చేయదు. కాబట్టి దేశం ఓడిపోయినట్లే అని శత్రువు భావిస్తాడు. కానీ, అప్పుడే అసలు కథ మొదలవుతుంది. మనుషులు చనిపోయినా.. యంత్రాలు మేల్కొంటాయి. సమాధి లోపల నిద్రపోతున్న మృత్యువు బయటకు వస్తుంది. దీనినే రష్యా ‘గ్యారెంటీడ్ రిటాలియేషన్’ అంటుంది. దీనికి ప్రాణం పోసే వ్యవస్థే డెడ్ హ్యాండ్ లేదా పెరిమీటర్.
ఎలా పనిచేస్తుంది? స్వయంచాలక వ్యవస్థ
ఒకవేళ రష్యాపై అణు దాడి జరిగినట్లు సెన్సార్లు నిర్ధారిస్తే.. ఆ వ్యవస్థ వెంటనే రష్యా హైకమాండ్‌కు సందేశం పంపుతుంది.. అక్కడి నుండి ఎలాంటి స్పందన రాకపోతే నాయకత్వం మొత్తం నాశనమైందని వ్యవస్థ భావిస్తుంది. అప్పుడు అదే స్వయంచాలకంగా యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఒక రకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఇది నేటి కాలపు చాట్ బాట్‌ల వంటిది కాదు. ఇది ఒక కఠినమైన మొండి ట్రిగ్గర్ మెకానిజం. వ్యవస్థ యాక్టివేట్ అయ్యాక ముందుగా కమాండ్ రాకెట్లు గాల్లోకి లేస్తాయి.. వీటిలో కేవలం శక్తివంతమైన రేడియో ట్రాన్స్‌మిటర్లు ఉంటాయి.. ఇవి గాల్లో నుండి రష్యా అంతటా ఉన్న సైలోస్, సబ్మెరైన్లు మొబైల్ లాంచర్లకు ఎన్‌క్రిప్టెడ్ సిగ్నల్స్ పంపుతాయి. ఈ సంకేతాలు అందిన వెంటనే, మానవ ప్రమేయం లేకుండానే అణు క్షిపణులు శత్రువు వైపు దూసుకెళ్తాయి. రష్యా వద్ద నేడు ఇవి 10 వేలకు చేరుకున్నట్లు అంచనా.. ఆ అణు విస్పోటన ఈ అనంత విశ్వంలో మన భూగోళాన్ని ఒక చిన్న అణు ధూళి మేఘంగా మార్చేస్తుంది.
డెడ్ హ్యాండ్ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం ఈ కమాండ్ రాకెట్లు.. శత్రువు భూమి మీద ఉన్న అన్ని కమ్యూనికేషన్ టవర్లను శాటిలైట్లను ధ్వంసం చేసినా సరే.. గాల్లో ప్రయాణించే ఈ రాకెట్లు ఇచ్చే సిగ్నల్‌ను ఎవరూ ఆపలేరు.. ఒక్కసారి ఈ రాకెట్ గాల్లోకి లేచిందంటే రష్యా వద్ద ఉన్న 5,500+ కంటే ఎక్కువ అణు వార్‌హెడ్లు నిద్ర లేస్తాయి. ఇది ఒక చనిపోయిన మనిషి చేయి శత్రువు గొంతు పట్టుకోవడం లాంటిది.. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది కేవలం మాటల యుద్ధం కాదు.. దీని వెనుక పక్కాగా పనిచేసే ఒక యంత్రం ఉంది. ఆ యంత్రానికి భావోద్వేగాలు ఉండవు. అది కేవలం గణాంకాలను, సెన్సార్ డేటాను మాత్రమే నమ్ముతుంది. మానవత్వం, యంత్రం.. ఒక వైరుధ్యం ఇక్కడ ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తుతుంది. ఒక యంత్రానికి ప్రపంచాన్ని అంతం చేసే అధికారం ఇవ్వడం సరైనదేనా?
ప్రపంచంపై అణు విస్ఫోటనం ముప్పు?
గతంలో సోవియట్ యూనియన్ కాలంలో ఇలాంటి తప్పులు జరిగాయి. కానీ అప్పుడు మనుషులు ఆ నిర్ణయాన్ని ఆపగలిగారు. పెరిమీటర్ వ్యవస్థలో కూడా చివరగా బటన్ నొక్కేందుకు భూగర్భ బంకర్లలో కొంతమంది అధికారులు ఉంటారు.. అయితే ఆ అధికారులకు బయట ఏం జరుగుతుందో తెలియదు.. వారికి తెలిసింది ఒక్కటే, నాయకత్వం నుండి కమ్యూనికేషన్ కట్ అయింది అంటే బయట దేశం నాశనమైంది. కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి. ఇది ఒక భయంకరమైన సైకలాజికల్ గేమ్. గ్యారెంటీడ్ రిటాలియేషన్ శాంతిని కాపాడటానికి చేసే ప్రయత్నం కాదు. అది యుద్ధం జరిగితే ఇద్దరూ ఉండరు అని హెచ్చరించే ఒక మృత్యు గంట.
గ్యారెంటీడ్ రిటాలియేషన్ అనేది రష్యన్ అహంకారం కాదు. అది వారి అస్తిత్వ పోరాటం. శత్రువుకు దొరకకుండా తనను తాను కాపాడుకోవడానికి రష్యా వేసుకున్న ఒక కవచం. కానీ ఈ కవచం ఎంత ప్రమాదకరమైనదంటే.. అణు యుద్ధం అంటూ జరిగితే గెలిచిన వారు ఉండరు. కేవలం చూడటానికి మిగిలిన వారు కూడా ఉండక పోవచ్చు.. డెడ్ హ్యాండ్ వ్యవస్థ ఇచ్చే సందేశం ఒక్కటే. మమ్మల్ని చంపాలనుకుంటే మీరు కూడా చావడానికి సిద్ధంగా ఉండండి. ఇది ఒక అత్యున్నత స్థాయి మేధోపరమైన యుద్ధ తంత్రం. నేటి ప్రపంచ రాజకీయాలను శాసిస్తున్న ఒక అదృశ్య హస్తం.
డెడ్ హ్యాండ్ వ్యవస్థ రష్యా యొక్క ‘గ్యారెంటీడ్ రిటాలియేషన్’ విధానానికి ఒక ఉదాహరణ. ఇది ప్రపంచ శాంతికి భంగం కలిగించే ప్రమాదకరమైన వ్యవస్థగా పరిగణించబడుతుంది.

