
రెండున్నర కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా డైరెక్టర్ సాయి మార్తాండ్ చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Key Points
లిటిల్ హార్ట్స్ సినిమా సూపర్ హిట్ అయింది.
సాయి మార్తాండ్ తన సప్లీలు రాసిన కాలేజీకి గెస్ట్ గా వెళ్ళాడు.
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.
నెటిజన్లు ఆయనను అభినందిస్తున్నారు.
లిటిల్ హార్ట్స్ సినిమా విజయం
Sai Marthand : మౌళి, శివాని జంటగా తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ సినిమా ఇటీవల రిలీజయి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. కేవలం రెండున్నర కోట్లు పెట్టి తెరకెక్కించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఏకంగా 32 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఒక్క సినిమాతో సినిమాకు పనిచేసిన వాళ్ళు, సినిమాలో నటించిన వాళ్ళు స్టార్స్ అయిపోయారు. లిటిల్ హార్ట్స్ సినిమాని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేసాడు. ఇది అతనికి మొదటి సినిమా. కానీ సినిమా చూస్తే చాలా అనుభవం ఉన్న దర్శకుడు తీసినట్టు ఉంటుంది.
తాజాగా లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. హైదరాబాద్ లోని ఓ కాలేజీకి లిటిల్ హార్ట్స్ మూవీ టీమ్ తో కలిసి గెస్ట్ గా వెళ్ళాడు. అక్కడ ఆడిటోరియంలో స్టూడెంట్స్ తో దిగిన ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నేను సప్లీలు రాసిన కాలేజీ అని పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఎక్కడైతే సప్లీ ఎగ్జామ్స్ రాశాడో అక్కడే గెస్ట్ గా వెళ్ళాడు కదా అని నెటిజన్లు సాయి మార్తాండ్ ని అభినందిస్తూ ఇది కదా సక్సెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సాయి మార్తాండ్ కాలేజీ విజిట్
వైరల్ పోస్ట్ మరియు ప్రతిస్పందనలు
సాయి మార్తాండ్ మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చేసాడు. అప్పుడు కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడంతో సప్లీల కోసం ఆ కాలేజీకి వెళ్లి ఎగ్జామ్స్ రాసాడు. ఇంజినీరింగ్ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చిన సాయి మార్తాండ్ ఇప్పుడు దర్శకుడిగా సక్సెస్ అవ్వడంతో తను సప్లీలు రాసిన కాలేజీకి ఇలా గెస్ట్ గా వెళ్లడం గమనార్హం.
సాయి మార్తాండ్ లాంటి యువ దర్శకుల విజయం తెలుగు సినీ పరిశ్రమకు మంచి సంకేతం. తన విజయానికి కారణమైన కాలేజీకి గెస్ట్‌గా వెళ్లడం అభినందనీయం.


