|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీతోనే షాక్! కాపీ ఆరోపణలు, ట్రోల్స్..ఏక్ దిన్ దుమ్ము దులిపేనా?

Published: 16-01-2026, 12:00 AM
షాకింగ్: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీతోనే షాక్! కాపీ ఆరోపణలు, ట్రోల్స్..ఏక్ దిన్ దుమ్ము దులిపేనా?
  • సాయి పల్లవి, జునైద్ ఖాన్ ‘ఏక్ దిన్’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల – కాపీ ఆరోపణలు!
  • ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ చిత్రంపై ట్రోల్స్ – గత సినిమాల ఫలితాలే పునరావృతం అవుతాయా?
  • థాయ్ రొమాంటిక్ డ్రామా ‘వన్ డే’ పోస్టర్‌ను పోలి ఉందంటూ నెటిజన్ల విమర్శలు
  • మే 1న ‘ఏక్ దిన్’ విడుదల – సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ వివాదంలో చిక్కుకుంది!

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూనే వివాదంలో చిక్కుకున్నారు. ఆమె నటిస్తున్న ‘ఏక్ దిన్’ మూవీ ఫస్ట్ లుక్‌పై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. అసలేం జరిగిందో తెలుసుకొండి!

‘ఏక్ దిన్’ మూవీ ఫస్ట్ లుక్‌పై వివాదం

నేచురల్ బ్యూటీగా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి(Sai Pallavi), గ్లామర్ షోలకు దూరంగా ఉంటూనే తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస విజయాలతో స్టార్ స్టేటస్‌ను అందుకున్న ఆమె, సంప్రదాయ లుక్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ‘లవ్ స్టోరీ’, ‘అమరన్’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో పాటు, గతేడాది వచ్చిన ‘తండేల్’ సినిమాతో మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించింది. రియల్ లైఫ్ ఇన్‌స్పైర్డ్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించి సాయి పల్లవిని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక త్వరలో ‘రామాయణ’ సినిమాలో కీలక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నెటిజన్ల ట్రోల్స్.. కారణమేంటి?

ఈ క్రమంలోనే.. సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ మొదలైంది. ‘ఏక్ దిన్’(ek din) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ హిందీ చిత్రంతో రాబోతుంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్(Junaid Khan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీట్ పెరిగింది. ఐస్‌క్రీమ్‌తో కనిపించిన సాయి పల్లవి, జునైద్ జంట లుక్ అందరినీ ఆకట్టుకున్నప్పటికీ, అదే సమయంలో వివాదానికి దారితీసింది. 2016లో విడుదలైన థాయ్ రొమాంటిక్ డ్రామా ‘వన్ డే’కు ఈ పోస్టర్ చాలా దగ్గరగా ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

సాయి పల్లవికి అదృష్టం కలిసొచ్చేనా?

టైటిల్ నుంచి పోస్టర్ వరకూ అన్నీ సేమ్‌గా ఉన్నాయని, ఇది రిమేక్? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా, గతంలో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన లాల్ సింగ్ చద్దా, లవ్ యప్పా, సితారే జమీన్ పర్ సినిమాల ఫలితాలను ప్రస్తావిస్తూ.. ‘ఏక్ దిన్’ కూడా అదే బాటలో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతుందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోలింగ్ పోస్టులు వైరల్‌గా మారడంతో, సాయి పల్లవి బాలీవుడ్ ప్రయాణం మొదలవకముందే అనుకోని అడ్డంకులు ఎదుర్కొంటోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక అదృష్టం కలిసొచ్చి వివాదం సర్దుమనిగి సినిమా హిట్ అవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి

సాయి పల్లవి బాలీవుడ్ ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి. వివాదాలు సర్దుమనిగి ఈ సినిమా హిట్ అవుతుందా లేదా వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.