|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సాయి పల్లవి బాలీవుడ్ షేకింగ్! ఆమిర్ ఖాన్ కొడుకుతో రొమాన్స్.. ‘ఏక్ దిన్’ ట్రైలర్ రిలీజ్.. రచ్చ రచ్చే!

Published: 11-03-2026, 5:35 AM
సాయి పల్లవి బాలీవుడ్ షేకింగ్! ఆమిర్ ఖాన్ కొడుకుతో రొమాన్స్.. 'ఏక్ దిన్' ట్రైలర్ రిలీజ్.. రచ్చ రచ్చే!
  • సాయి పల్లవి, ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో రొమాంటిక్ మూవీ ‘ఏక్ దిన్’ మే 1న రిలీజ్!
  • థాయ్ రొమాంటిక్ డ్రామా ‘వన్ డే’ ఆధారంగా తెరకెక్కిన ‘ఏక్ దిన్’ మూవీ ట్రైలర్ విడుదల!
  • ఈ సినిమాలో రోహన్, మీరా మధ్య ‘క్షణికమైన బంధం’ ప్రధానాంశం!
  • అరిజిత్ సింగ్ పాడిన టైటిల్ సాంగ్ హైలైట్‌గా నిలిచింది, రామ్ సంపత్ సంగీతం!

టాలీవుడ్ సెన్సేషన్ సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టింది! ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో కలిసి ‘ఏక్ దిన్’ సినిమాలో నటించింది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం!

సాయి పల్లవి, ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో రొమాన్స్

Sai Pallavi: సాయి పల్లవి నటిస్తున్న తొలి హిందీ సినిమా ఏక్ దిన్ ట్రైలర్ (Ek Din Trailer) రిలీజైంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా మే 1న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న విభిన్నమైన లవ్ స్టోరీ మూవీ ‘ఏక్ దిన్’ (Ek Din). ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ బుధవారం (మార్చి 11) విడుదలైంది. ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 1న థియేటర్లలోకి రానుంది. ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది.

‘ఏక్ దిన్’ మూవీ ట్రైలర్ విడుదల.. విశేషాలు ఇవే!

ఏక్ దిన్ ట్రైలర్.. రోహన్, మీరా లవ్ స్టోరీ

ఈ కథలో ప్రధానాంశం ‘క్షణికమైన బంధం’. ట్రైలర్ చివరలో మీరా, రోహన్‌ను “ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపో” అని గట్టిగా అరుస్తుంది. కానీ “కొన్నిసార్లు ఒక్క రోజు చాలు” అనే డైలాగ్ కథలోని లోతును వివరిస్తుంది. రేపటి రోజున ఏం జరుగుతుందో ఎవరికీ గుర్తుండకపోవచ్చు అనే గంభీరమైన వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్ ముగియడం ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచుతోంది.

థాయ్ మూవీ ఆధారంగా సాయి పల్లవి ‘ఏక్ దిన్’ మూవీ

ఏక్ దిన్ నటీనటులు, ఇతర విశేషాలు

రామ్ సంపత్ మ్యూజిక్ కంపోచ్ చేయగా.. అరిజిత్ సింగ్ పాడిన టైటిల్ సాంగ్ ఇప్పటికే హైలైట్‌గా నిలిచింది. 2016 నాటి థాయ్ రొమాంటిక్ డ్రామా ‘వన్ డే’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జపాన్‌లోని సపోరో మంచు కొండల నేపథ్యంలో అందమైన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేయనున్నాయి.

‘ఏక్ దిన్’ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సాయి పల్లవి నటన, జునైద్ ఖాన్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.