
బాలీవుడ్ రామాయణం సినిమాలో సీత పాత్ర ఎంపిక చర్చనీయాంశంగా మారింది. మొదట శ్రీనిధి శెట్టిని ఆడిషన్ చేసి రిజెక్ట్ చేయగా, చివరికి సాయి పల్లవికి ఆ ఛాన్స్ దక్కింది. ఈ విషయం శ్రీనిధి శెట్టి స్వయంగా వెల్లడించడంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు.
Key Points
రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రామాయణం తెరకెక్కుతోంది.
సీత పాత్ర కోసం ముందు శ్రీనిధి శెట్టిని ఆడిషన్ చేసి రిజెక్ట్ చేశారు.
శ్రీనిధి శెట్టి ఈ విషయం స్వయంగా మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.
రామాయణం మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది.
సీత పాత్రకు శ్రీనిధి శెట్టి రిజెక్ట్!
Sai Pallavi : బాలీవుడ్ లో రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా రామాయణం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారి దర్శకత్వంలో రెండు పార్టులుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ రామాయణంలో వివిధ పాత్రల్లో బాలీవుడ్ లోని చాలా మంది స్టార్స్ నటిస్తున్నారని సమాచారం. రావణాసురుడిగా కేజిఎఫ్ యశ్ నటిస్తున్నాడు.(Sai Pallavi)
అయితే ఈ సినిమాలో సీత పాత్రకు ముందు వేరే హీరోయిన్ ని అనుకున్నారట. ఆడిషన్ కూడా తీసుకున్నారట. కానీ చివరకు సాయి పల్లవిని తీసుకున్నారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీనిధి శెట్టి. కేజిఎఫ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఇటీవల నానితో కలిసి హిట్ 3 సినిమాలో మెప్పించింది. త్వరలో తెలుసు కదా అనే సినిమాతో రాబోతుంది.
సాయి పల్లవి ఎంపికకు కారణం ఏమిటి?
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపింది. శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. బాలీవుడ్ రామాయణం సినిమా సీత పాత్రకు నన్ను ఆడిషన్ తీసుకున్నారు. నేను వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. మూడు పేజీల డైలాగ్స్ కూడా చెప్పాను. కానీ నన్ను సెలెక్ట్ చేసుకోలేదు. చివరకు ఆ ఛాన్స్ సాయి పల్లవి గారికి వెళ్ళింది. నన్ను ఆడిషన్ తీసుకునేటప్పటికే ఆ సినిమాలో ఆల్మోస్ట్ అందర్నీ సెలెక్ట్ చేసుకున్నారు అని తెలిపింది.
రామాయణం సినిమా విడుదల తేదీలు
దీంతో బాలీవుడ్ రామాయణం సినిమాలో సీతగా మంచి పాత్ర మిస్ అయింది శ్రీనిధి శెట్టికి అని ఆమె ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక రామాయణం సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది.
చివరగా, బాలీవుడ్ ‘రామాయణం’లో శ్రీనిధి శెట్టికి సీత పాత్ర మిస్సవగా, సాయి పల్లవికి దక్కింది. ఈ సినిమా కోసం సినీ ప్రియులు, ముఖ్యంగా సాయి పల్లవి, శ్రీనిధి శెట్టి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


