
ప్రముఖ నటి కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లోక: చాప్టర్ వన్ చంద్ర’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం సూపర్ హీరో ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. నస్లెస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
Key Points
దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న 'లోక: చాప్టర్ వన్ చంద్ర' చిత్రం
కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు
ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది
‘లోక: చాప్టర్ వన్ చంద్ర’ చిత్రం విశేషాలు
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) 2017లో ‘హలో’ చిత్రంతో సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. ఈ హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘లోక: చాప్టర్ వన్ చంద్ర’. డొమినిక్ అర్జున్ దర్శకత్వం వహిస్తు్న్న ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెస్ మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. సూపర్ హీరో ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ మూవీని దుల్కర్ సల్మాన్ నర్మిస్తున్నాడు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేసే చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తుండగా.. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ ఓ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించగా.. నస్లెస్ ఆమెను చూస్తూ భయపడుతున్నట్లు చూపించారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. సినిమాపై క్యారియాసిటీ నెలకొంది.
A post shared by Dulquer Salmaan (@dqsalmaan)
కళ్యాణి ప్రియదర్శన్ పవర్ ఫుల్ లుక్
దుల్కర్ సల్మాన్ నిర్మాణం
కళ్యాణి ప్రియదర్శన్ మరియు నస్లెస్ నటనతో కూడిన ‘లోక: చాప్టర్ వన్ చంద్ర’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంది. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


