|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మేకప్‌తో తలనొప్పి లేదు! సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్, ఇండస్ట్రీలో సంచలనం

Published: 18-12-2025, 4:44 AM
మేకప్‌తో తలనొప్పి లేదు! సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్, ఇండస్ట్రీలో సంచలనం
  • సాయి పల్లవి మేకప్‌కు దూరంగా ఉంటూ సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
  • పాత్ర నటనకు ప్రాధాన్యత ఇస్తుంది తప్ప మేకప్‌కు కాదని స్పష్టం చేసింది.
  • బాలీవుడ్‌లో నితీష్ తివారీ ‘రామాయణం’లో సీత పాత్రలో నటిస్తోంది.
  • మణిరత్నం, రజనీకాంత్ చిత్రాలతో పాటు ‘తండేల్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో బిజీగా ఉంది.

సాయి పల్లవి వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మేకప్‌పై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సహజ అందానికే ప్రాధాన్యతనిచ్చే ఈ స్టార్ హీరోయిన్, ఎందుకు మేకప్‌కు దూరంగా ఉంటుందో, ఆమె ప్రస్తుత ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం.

సాయి పల్లవి: సహజత్వమే నా అందం

మలయాళ ‘ప్రేమమ్’తో వెండితెరపైకి  అరంగేట్రం చేసి, తెలుగు, తమిళ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి, ఇప్పుడు పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగింది. కథాబలం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న సాయి పల్లవి.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సాధించింది.

సినిమాల్లో మేకప్‌కు దూరంగా ఉంటూ, తన సహజమైన నటన, అందంతో సాయి పల్లవి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాత్రకు మాత్రమే ఇంపార్టెన్స్  ఇస్తుందే తప్ప, మేకప్‌కు కాదు. ఈ విషయాన్ని ఆమె ఎన్నో సందర్భాల్లో చెపుతూ వచ్చింది. ఇప్పటికీ అదే ఫాలో అవుతోంది నేచురల్ బ్యూటీ.

మేకప్ అవసరం లేదంటున్న స్టార్ హీరోయిన్

సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన సాయి పల్లవి.. బాలీవుడ్ ను కూడా ఆకర్శించింది. ప్రస్తుతం బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న ‘రామాయణం’ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబతోంది. రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఆమె నటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పాత్రలు భిన్నంగా ఉంటే చాలని, ఒకేలాంటి పాత్రకు రకరకాల మేకప్ వేయడం అనవసరం అని సాయి పల్లవి అంటోంది. తన దర్శకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆమె వెల్లడించింది. పాత్ర నటనలో వేరియేషన్ కనిపించాలి కానీ.. మేకప్ వల్ల అది రాకూడదు అని ఆమె అభిప్రాయం. అందుకే సాయి పల్లవి మేకప్ కు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది.

బాలీవుడ్, టాలీవుడ్‌లో సాయి పల్లవి ప్రాజెక్టులు

సాయి పల్లవి చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తోంది. ఎంత పెద్ద సినిమా అయినా.. తన  పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోేతే చేయదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. కథ నచ్చకపోతే రిజెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం సాయి  పల్లవి బాలీవుడ్ లో  ‘రామాయణం’తో పాటు, మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన, ‘తలైవర్ 173’లో రజనీకాంత్‌తో కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగులో తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సాయి పల్లవి.

సాయి పల్లవి తన బోల్డ్ నిర్ణయాలతో, నటనకు ప్రాధాన్యతనిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మేకప్‌పై ఆమె అభిప్రాయం, సినిమా ఎంపికలో ఆమె నిబద్ధత నిజంగా అభినందనీయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.