|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ పరిచయంతో… ‘మేరే రహో’

Published: 12-09-2025, 7:41 PM
ఆ పరిచయంతో... 'మేరే రహో'

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన సాయిపల్లవి హిందీలో తన తొలి చిత్రం ‘మేరే రహో’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో కలిసి నటించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది.

Key Points

1

సాయిపల్లవి హిందీ సినిమా 'మేరే రహో' డిసెంబర్ 12న విడుదల

2

జునైద్ ఖాన్ తో సాయిపల్లవి జంటగా నటన

4

'రామాయణం' సినిమాలో సీతగా సాయిపల్లవి నటించడం గమనార్హం

సాయిపల్లవి హిందీ ప్రవేశం

హీరోయిన్‌ సాయిపల్లవి హిందీలో నటించిన తొలి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్‌ లవ్‌స్టోరీ చిత్రం ‘మేరే రహో’. సునీల్‌ పాండే దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్, మన్సూర్‌ ఖాన్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్‌ కానుంది. ఒకరితో ఒకరికి పరిచయం లేని ఓ అబ్బాయి, అమ్మాయి ఓ రోజు విచిత్రకరమైన పరిస్థితుల్లో కలుసుకుంటారు.

ఆ పరిచయం వారి జీవితాలను ఎలా మార్చేసింది? అన్న కోణంలో ఈ ‘మేరే రహో’ సాగుతుందని బాలీవుడ్‌ సమాచారం. తొలుత ఈ సినిమాకు ‘ఏక్‌ దిన్‌’ అనే టైటిల్‌ అనుకున్నారు. నవంబరులో రిలీజ్‌  ప్లాన్‌ చేశారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. ఈ సినిమా కాకుండా హిందీలో ‘రామాయణ’ సినిమాలో సీతగా సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.

‘మేరే రహో’ విడుదల తేదీ

చిత్ర కథాంశం

చివరగా, సాయిపల్లవి హిందీ సినిమా ప్రయాణం ప్రారంభం ‘మేరే రహో’ చిత్రంతో ఎంత ఆసక్తికరంగా ఉంటుందో చూడాలి. ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.